జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ లతో క్రేజీ హీరోయిన్ల తో వరసగా సినిమాలు చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సుడి చాలా బలంగా ఉంది. లేకపోతే ఎంత డిజాస్టర్ వచ్చినా దానికి మించిన మొత్తం ఖర్చు పెట్టే నిర్మాత దొరుకుతున్నాడు. మొదటి సినిమా అల్లుడు శీను మొదలుకుని మొన్న వచ్చిన లేటెస్ట్ బాంబ్ సాక్ష్యం దాకా ఇదే జరుగుతోంది. పెట్టిన బడ్జెట్ ని సైతం వెనక్కు తేలేక ఇబ్బంది పడుతున్న సాయి శ్రీనివాస్ తో భారీ సినిమాలు తీసే నిర్మాతలు ఇంకా ముందుకు రావడం విశేషం.
ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం కంబోడియాలో జరుగుతోంది. అది పూర్తి చేసుకుని ఇండియా వచ్చాక కొంత పార్ట్ ఇక్కడ తీసి మరో కీలకమైన షెడ్యూల్ కోసం మళ్ళి ఫారిన్ వెళ్ళబోతున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు సైతం 40 కోట్ల దాకా బడ్జెట్ అవుతోందట. సాక్ష్యంకు ఇంతే ఖర్చు పెట్టినా అది కనీసం సగం కూడా వెనక్కు ఇవ్వలేకపోయింది.
మరి ఇప్పుడు ఏ ధైర్యంతో నిర్మాతలు అంతేసి ఖర్చు పెడుతున్నారో అర్థం కానీ విషయం. హీరోయిన్లు గా కాజల్ అగర్వాల్ మెహ్రీన్ లను తీసుకున్నా వాళ్ళ పారితోషికానికి భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం. ఇప్పటిదాకా బెల్లం హీరో ఒక్క స్పీడున్నోడులో మాత్రమే పేరు లేని హీరోయిన్ సరసన నటించాడు. మిగిలిన వన్నీ ఒకరిని మించి ఒకరు డిమాండ్ ఉన్న బ్యూటీసే. వచ్చే వేసవి విడుదల ప్లాన్ చేసిన ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే టాక్ ఉంది కానీ దర్శకుడు తేజ ఏ చిన్న అప్ డేట్ కూడా మీడియాకు ఇవ్వడం లేదు.
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడితే కానీ సాయి శ్రీనివాస్ తానేంటో రుజువు చేసుకోలేడు. అది తేజ సినిమా నెరవేరుస్తుందనే అంచనాలోనే ఉన్నాడు. నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ తర్వాత తేజ చేస్తున్న మూవీ కాబట్టి ఆ బ్రాండ్ కూడా మార్కెట్ పరంగా హెల్ప్ అయ్యేలా ఉంది. గ్రాండియర్ లేకుండా ఓ సింపుల్ మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసే టైం వస్తుందంటారా