బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. షూటింగ్ చాలా సరదాగా సాగుతోంది అంటూ ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. కాజల్ - తేజలతో ఉన్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ లొకేషన్ నుండి ఒక ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది.
ఏనుగు దంతాలపై కూర్చుని ఉన్న ఫొటోను శ్రీనివాస్ పోస్ట్ చేశాడు. పకృతిలో షూటింగ్ చాలా సంతోషంగా సాగుతోంది అంటూ కామెంట్ పెట్టి పోస్ట్ చేసిన ఆ ఫొటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. ఏనుగు దంతాలపై కూర్చుని ఫొటో దిగడం ఏంటీ బాసు అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫోజ్ తప్ప నీకు మరేది దొరకలేదా అంటూ మరి కొందరు అంటున్నారు. షూటింగ్ లో జంతువులను హింసించింది చాలదన్నట్లు - ఆఫ్ ద స్క్రీన్ కూడా హింసించాలా అంటూ బెల్లంకొండ తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఇటీవల విడుదల పోస్ట్ చేసిన ఫొటోలతో అందరి దృష్టిని ఆకర్షించి - సినిమాపై ఆసక్తిని కలిగించడంలో సఫలం అయిన బెల్లంకొండ ఈసారి మాత్రం ఏనుగు దంతాలపై కూర్చున్న ఫొటోతో వివాదాస్పదం అయ్యాడు. ఈ ఫొటో మరింత వివాదాస్పదం కాకుండానే బెల్లంకొండ డిలీట్ చేయడం బెటర్. లేదంటే నానా రచ్చ జరగడం ఖాయం అంటూ సోషల్ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఇలాంటి వివాదాస్పద పిక్ లను పెట్టక పోవడం మంచిదని కూడా బెల్లంకొండకు సలహా ఇస్తున్నారు.