'మానాడు'లో భల్లాలుడు.. ఆ నిర్మాత ప్లాన్ అదేనా?

Update: 2022-10-24 14:30 GMT
తమిళ స్టార్ హీరో శింబు నిత్యం ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ లో ఉంటాడు.  ఈ స్టార్ హీరో కేవలం తమిళ ఇండస్ట్రీకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. శింబు నటించిన పలు సూపర్ హిట్స్ సినిమాలు తెలుగులోనూ డబ్బింగై మంచి వసూళ్లను రాబట్టాయి. దీంతో శింబుకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక శింబు హీరోయిన్లతో నడిపే ఎఫైర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ హీరో తనతో ఏ కొత్త హీరోయిన్ కలిసి నటించిన వెంటనే పులిహోర కలిపేస్తుంటాడు. కొంతమంది ముద్దుగుమ్మలతో ఏకంగా కొన్నేళ్లు డేటింగులు గ్రటా చేసి పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. చివరి నిమిషాల్లో ఆ జోడీ బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిన వాళ్లు సైడ్ అయిపోవడం విశేషం.

ఇదిలా ఉంటే శింబు తమిళంలో నటించిన 'మానాడు' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నాడు. సైన్స్ ఫిక్షన్.. యాక్షన్ థ్రిల్లర్ బ్రాక్ డ్రాప్ తో రూపొందిన 'మానాడు'ను తెలుగు నెటివీటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయించారట.

ఈ సినిమా దర్శకుల విషయంలో తొలి నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. హరీష్ శంకర్ లేదంటే దశరథ్ 'మానాడు'ను రీమేక్ చేస్తారనే ప్రచారం జరిగినా ఇప్పుడు కొత్త దర్శకుడు లైన్లోకి వచ్చాడని తెలుస్తోంది. అదేవిధంగా హీరోగా నాగచైతన్య పేరు తొలుత వినిపించింది. ఆ తర్వాత రవితేజ, సిద్ధు జొన్నలగడ్డ పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే ఇవన్నీ కూడా నిజం కాదని తెలుస్తోంది. 'మానాడు' మూవీని సురేష్ బాబు తన కుమారుడు రానా కోసం తీసుకున్నారట. ఈ సినిమా రానాకు చాలా బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట. దీంతో అతడితోనే 'మానాడు'ను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రానా సోలోగా హిట్టు కొట్టి చాలా రోజులవుతుంది. మరీ ఆ లోటును 'మానాడు' తీరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News