#భార‌తీయుడు 2.. లైకా దిగొచ్చిందా! శంక‌ర్ కి లైన్ క్లియ‌రైన‌ట్టేనా?!

Update: 2020-12-11 05:34 GMT
కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భార‌తీయుడు 2` .. అలాగే `విక్రమ్` పేరుతో వేరొక మూవీ చే‌స్తున్నారు. అయితే ఇటీవ‌ల భార‌తీయుడు 2 ద‌ర్శ‌క‌నిర్మాతల న‌డుమ వివాదం గురించి తెలిసిన‌దే.

ప్ర‌స్తుతం  లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `విక్ర‌మ్` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. అయితే శంకర్ తో  ఇండియన్ 2 మొద‌ల‌య్యేదెపుడు? అంటే ఇన్నాళ్లు ఈ చిత్రం గురించి ఎటువంటి  స‌మాచారం లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. భారతీయుడు 2 షూటింగ్ జనవరి లో పునః ప్రారంభం కానుంది. క‌మల్ హాసన్ కూడా జనవరి నుంచి సెట్స్ కి వ‌స్తున్నారు. భార‌తీయుడు 2తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని విక్రమ్ మూవీ కోసం కమల్ ఏకకాలంలో షూటింగ్ చేయనున్నట్లు తెలిసింది.

`విక్రమ్`‌ను కమల్ హాసన్ రాజ్ కమల్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్- రకుల్ ప్రీత్ సింగ్  నాయిక‌లుగా న‌టిస్తున్నారు. సిద్ధార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంత‌కుముందు ప్రమాదం కారణంగా ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయడంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.

ప్రమాదం తరవాత చిత్రీక‌ర‌ణ‌ ప్రారంభించ‌గానే కోవిడ్ 19 క్రైసిస్ మొద‌లైంది. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తిరిగి జ‌న‌వ‌రిలో ప్రారంభించాల‌న్న‌ది ప్లాన్. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

మరోవైపు విక్రల్ టీజర్ కమల్ హాసన్ పుట్టినరోజున విడుదలైంది. దీనికి అభిమానుల నుండి మంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రంలోని మిగిలిన తారాగణం స‌హా సిబ్బంది వివ‌రాల్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్.. తారాగణం సిబ్బంది గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయని భావిస్తున్నారు. ట్యాలెంటెడ్ అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు.
Tags:    

Similar News