ప్రిన్స్ మహేష్ బాబు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసాడు. కెరీర్లో తొలిసారి సిఎంగా నటిస్తున్న భరత్ అను నేను ఫస్ట్ ఓత్ పేరిట మహేష్ వాయిస్ ఉన్న ప్రమాణ స్వీకారాన్ని ఇందాకే సోషల్ మీడియాలో విడుదల చేసారు. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు గవర్నర్ ఏదైతే రాజ్యంగా బద్ధంగా ప్రమాణం చేయిస్తూ చదివిస్తారో అందులో అక్షరం పొల్లు పోకుండా అదే దీనికి కూడా వాడుకున్నారు. మహేష్ వాయిస్ మంచి బేస్ లో వినిపిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో మంద్రంగా వినిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దేవి శ్రీ ప్రసాద్ అదరగొట్టాడు. ఇలాంటి ప్రయోగం ఇది మొదటి సారి అని చెప్పొచ్చు. భరత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని అంటూ మొదలు పెట్టిన ఈ ఓత్ దైవ సాక్షిగా ప్రమాణం చేయటంతో ముగిసింది. 50 సెకండ్ల ఆడియోకు ఫస్ట్ లుక్ లాంటిది ఏది జత చేయలేదు.
ప్రస్తుతానికి దీనితో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెగ్యులర్ గా కాకుండా కొత్త తరహాలో ఇలా చేయటం పట్ల పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఫస్ట్ ఓత్ పేరిట డిజైన్ చేసిన పోస్టర్ లో టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు. స్వాతంత్ర్యం కోసం జరిపిన దండి యాత్ర తరహాలో ఒక సమూహం కలిసికట్టుగా నడవటాన్ని మాత్రమే ఇందులో చూపించారు. ఒకవేళ కొంత టైం తీసుకుని టైటిల్ , రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ థీమ్ ద్వారా మహేష్ బాబు పూర్తి స్థాయి ముఖ్య మంత్రిగా సీరియస్ రోల్ చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. కైరా అద్వాని హీరొయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీకి శ్రీమంతుడు తర్వాత దర్శకుడు కొరటాల శివ మహేష్ తో మరోసారి జట్టు కట్టాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న భరత్ అను నేను ఏప్రిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
Full View
Click Here For Video : https://www.facebook.com/urstrulyMahesh/videos/2059978534238211/