పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నప్పటికీ.. అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అనే సందేహాలు మాత్రం అందరిలో ఉన్నాయి. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన అధినేత కాస్త ముందుగానే ప్రణాళికలు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోతే సినిమా షూటింగ్ లలో పాల్గొనే సమయం దొరక్కపోవచ్చు.
అందుకే పవన్ కు అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు ఆందోళన చెందుతున్నారనే కామెంట్స్ ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో వినిపించాయి. అయితే పవన్ వీలైనంత త్వరగా కమిటైన సినిమాలు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో చిత్రాన్ని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇదే క్రమంలో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి ''భవదీయుడు భగత్ సింగ్'' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడనికి స్టార్ హీరో సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
అప్పుడెప్పుడో అధికారికంగా ప్రకటించబడిన 'భవదీయుడు..' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ ఇతర కమిట్ మెంట్స్ ను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్న అప్డేట్ వచ్చింది.
'భవదీయుడు భగత్ సింగ్' కు సంబంధించిన షూటింగ్ అతి త్వరలో ప్రారంభించబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఎగ్జైటింగ్ వార్తలు & అప్డేట్లు రాబోతున్నాయని తెలిపారు. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దల్ బాషింగాలే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ తో కలిసి దిగిన ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
'హరి హర వీరమల్లు' సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ మరియు నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి హీరో సైడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ తో మీటింగ్ గురించి హరీష్ ట్వీట్ చేస్తూ.. ''ప్రతిసారి… ప్రతి సమావేశం.. ప్రతి సంభాషణ అడ్రినలిన్ రష్ ఇస్తుంది.. అంతా సిద్ధంగా ఉంది.. టేకాఫ్ కోసం వేచి ఉండలేకపోతున్నాం..' అని పేర్కొన్నారు.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ - హరీష్ కాంబోలో రాబోతున్న ''భవదీయుడు భగత్ సింగ్'' మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా వేచి చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో రూపొందే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇందులో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. 'మీర్జాపూర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి - కమెడియన్ సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తారు.