పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మల్టీస్టారర్ భీమ్లా నాయక్ లో తన పాత్ర చిత్రణను పూర్తి చేసారు. ప్రస్తుతం హరి హర వీర మల్లు షూటింగ్ ని పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీటితో పాటు భవదీయుడు భగత్ సింగ్ కి సంబంధించి ఏదైనా చెబుతారా? అంటూ సోషల్ మీడియాల్లో పవన్ అభిమానుల ఎటాక్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ సమాధానం ఇవ్వాల్సొచ్చింది.
తాజాగా హరీష్ శంకర్ తన ట్విటర్ ప్రొఫైల్ లో దీనికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అన్ని పనులు జరుగుతున్నాయని దర్శకుడు హరీష్ ట్విట్టర్ లో స్పష్టం చేశారు.
హరీష్ ట్విట్టర్ లో వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ``హాయ్ గైస్.. భవదీయుడు భగత్ సింగ్ అప్ డేట్ ల కోసం చాలా మంది నన్ను అడుగుతున్నారు. సినిమాలో టైమింగ్ తో పాటు.. సినిమా టైమింగ్ కూడా అంతే ముఖ్యం అని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను మీతో పంచుకుంటాను. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి. మీ సహనం మద్దతు కి చాలా ధన్యవాదాలు`` అని అన్నారు.
అంతకంతకు ఆలస్యమవుతుండడం వల్లనే హరీష్ పై అభిమానుల ఒత్తిడి పెరుగుతోంది. అందుకే ఇలా వివరణ ఇచ్చాడన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మైత్రి సంస్థ అధికారికంగా ప్రాజెక్ట్ వివరాల్ని ప్రకటిస్తుందేమో చూడాలి.
వీరమల్లు గెటప్ ఛేంజ్
పవన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ హరి హర వీర మల్లుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని తెలిసింది. ఇది చాలా కాలం నుండి చిత్రీకరణ దశలో ఉంది. కోవిడ్ వల్ల షెడ్యూల్స్ ఆలస్యమయ్యాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ ని మళ్లీ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ తన డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈసారి వన్ టైమ్ సెటిల్ మెంట్ ప్రకారం.. సెట్స్‌పైకి రాగానే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను సాంతం పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా.. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా. భారతదేశంలో ప్రవేశించిన బ్రిటీష్ వారి దోపిడీ నేపథ్యం.. కోహినూర్ వజ్రం నెమలి సింహాసనం దొంగతనం నేపథ్యంలో కొన్ని ఫిక్షనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కంటెంట్ ఉంటుందని ఇంతకుముందు టాక్ వినిపించింది.
ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ స్నేహితుడు ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.