ఎట్టకేలకు కెప్టెన్ అయిన శ్రీముఖి..టాస్క్‌ లో విజయం

Update: 2019-09-28 05:05 GMT
ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో శ్రీముఖి - రవి - శివజ్యోతి - బాబా భాస్కర్ పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. మొన్న మూడు రోజుల పాటు జరిగిన వీక్లీ టాస్క్ లో ఈ నలుగురు బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఎపిసోడ్ లో జరిగిన కెప్టెన్ టాస్క్‌ లో నలుగురు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా వారికి బిగ్ బాస్ కలర్ ఫుల్ కెప్టెన్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం నలుగురు కెప్టెన్ పోటీదారులకు వివిధ రంగుల కలర్స్ తో నిండి ఉన్న బౌల్స్ ఇచ్చి అందులోని కలర్స్‌ ని రెండు చేతులతోనూ పట్టుకుని కింద పడకుండా చూసుకోవాలని చెప్పారు.

ఫైనల్‌ గా ఎవరి బౌల్‌ లో ఎక్కువ కలర్ వాటర్ ఉంటుందో వాళ్లే ఇంటికి కెప్టెన్‌ అవుతారని, ఈ టాస్క్ కు మహేశ్ సంచాలకుడుగా ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ఈ టాస్క్‌ లో నచ్చని వారి కలర్ కింద పడేలా చేసి - నచ్చిన వారి కలర్ కాపాడవచ్చని తెలిపాడు. దీంతో బజర్ మ్రోగగానే గేమ్ మొదలైంది. నలుగురు పోటీదారులు వారి కలర్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో మొదట ఇంటి సభ్యులు ఎక్కువుగా బాబాని టార్గెట్ చేశారు. ముఖ్యంగా అలీ - రాహుల్  బాబా చేతిలో ఉన్న కలర్ ని తీసే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లుగానే చాలావరకు తీసేశారు. అయితే చివరికి ఆయన చేతిలో బౌల్ ని అలీ తీసేసుకున్నాడు. దీంతో బాబా కెప్టెన్ టాస్క్ నుంచి పక్కకు తప్పుకున్నారు. అటు శివజ్యోతి టేబుల్ కిందకు వెళ్ళి కలర్ ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ క్రమంలో బౌల్ ని ఒక చేత్తో పట్టుకోవడంతో బిగ్‌ బాస్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్ల‌య్యింది. దీంతో జ్యోతి కూడా కెప్టెన్ టాస్క్ నుంచి వైదొలిగింది.

చివరికి టాస్క్‌లో శ్రీముఖి - రవి మిగిలారు. ఇద్దరు చేతుల్లో కలర్ ఫుల్ గానే ఉంది. జాగ్రత్తగానే పట్టుకున్నారు. ఈ సమయంలో రవి.. నిదానంగా శ్రీముఖి వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు. అది చూసిన వితికా రవి కలర్ కింద పడేసింది. దీంతో రవి ఓడిపోయాడు...శ్రీముఖి విన్నర్‌ గా నిలిచి ఈ వారం ఇంటికి కెప్టెన్ అయింది. పది వారాల తర్వాత శ్రీముఖి కెప్టెన్ కల నెరవేరింది.  


Tags:    

Similar News