గీత గోవిందం సక్సెస్ పరశురాం కి ఎంత కలిసొచ్చింది? స్టార్ డైరెక్టర్ల జాబితా లో చేరిపోయినట్టేనా ? అంటే ప్రస్తుతం అతడి సన్నివేశం అలా కనిపించడం లేదు. పరిమిత బడ్జెట్ లో తెరకెక్కించిన గీత గోవిందం అనూహ్యంగా 100 కోట్లు తెచ్చి జోష్ పెంచింది. ప్రస్తుతం పరశురాం ఆ ఇమేజ్ ను కాపాడు కునే ప్రయత్నా ల్లో ఉన్నాడు. స్టార్ హీరోల వెంట పడుతున్నాడు. ఇప్పటికే మహేష్ కు రెండు మూడు కథలు వినిపించాడు. కానీ అవేవి నచ్చ లేదట. కథలో ఇంకా కొత్త దనం కోరుకుంటున్నాడట.
మహేష్ తో కుదిరే పని కాకపోవడంతో తాత్కలికంగా మహేష్ జోలికి వెళ్లడం లేదట. ఆ మధ్య మహేష్ కి వినిపించిన స్టోరి ఒకటి అఖిల్ కి వినిపించి మెప్పించాడని ప్రచారమైంది. బొమ్మరిల్లు భాస్కర్ తర్వాత అఖిల్ ను డైరెక్ట్ చేసేది పరుశురాం అని బలంగా వినిపిస్తోంది. ఇంత లోనే పరుశురాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పైనే కన్నేసాడని ప్రచారమైంది. డార్లింగ్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని ఓ కొత్త స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నాడుట. ఇప్పటి కే ప్రభాస్ ని కలిసి లైన్ వినిపించాడు. మరి ప్రభాస్ కి పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించేది ఎప్పుడు అన్నది తెలియాల్సి ఉంది.
సాహో పరాజయం తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా కేటగిరి లోనే మరో సినిమాకు సన్నాహాకాలు చేస్తున్నాడని ఈసారి బాలీవుడ్ లో నటిస్తాడని ఓవైపు ప్రచారం వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యం లో పరశురామ్ కి అవకాశం ఉంటుందా ఉండదా? అన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం జిల్ దర్శకుడు రాధాకృష్ణతో జాన్ లో నటిస్తున్నాడు. ఇది ఓ డిఫరెంట్ స్టోరీ. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎంచుకునే స్క్రిప్ట్ ఎవరితో అనేది తేలాల్సి ఉంది. సాహో లాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలి. స్టోరీ.. డైరెక్టర్ ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. మరి ఇన్ని సవాళ్లను అధిగమించి పరశురాం ఫైనల్ స్క్రిప్టుతో ఒప్పించగలడా లేదా? అన్నది తేలాలి అంటే కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.