పాపులర్ షోలను వివిధ భాషల్లో చేస్తున్నప్పుడు.. అక్కడి నేటివిటికీ తగ్గట్లుగా కాస్తోకూస్తో మార్చటం మామూలే. బిగ్ బాస్ సైతం అందుకు మినహాయింపు కాదు. ఇదే.. బిగ్ బాస్ సీజన్ 1 సక్సెస్ కు కారణంగా చెప్పాలి. తొలి సీజన్ లో అగ్ర హీరోల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ ను హోస్ట్ గా చేయటం ద్వారా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
తారక్ చేస్తున్న షోతో బిగ్ బాస్ షోకు భారీ ఆదరణే లభించింది. దీనికి తోడు మొదటి సీజన్ లో హౌస్ మేట్స్ ఎంపికకు సంబంధించి సెలబ్రిటీలు ఎక్కువనే చెప్పాలి. దీనికి తోడు.. అనవసరమైన గొడవలు పెద్దగా ఉండేవి కాదు. దీంతో.. అందరి మనసుల్ని దోచుకుంటూ తర్వాతేం జరుగుతుందన్న ఉత్కంటతో తొలి సీజన్ సాఫీగా సాగింది.
ఫూణే నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి మారిన బిగ్ బాస్ సీజన్ 2 ఆది నుంచి ఎదురుదెబ్బలు తగలక తప్పటం లేదు. తారక్ ను నాని రీప్లేస్ చేయకపోవటం తర్వాతి సంగతి.. కనీసం చేయాల్సిన స్థాయిలో చేయకపోవటం ఒక దెబ్బ అయితే.. లీకుల పోటు ఓ రేంజ్లో ఉంది. దీంతో.. బిగ్ బాస్ ను టీవీలో కంటే సోషల్ మీడియాలోనే ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఇది సరిపోదన్నట్లుగా కంగాళీ నిర్ణయాలతో.. పిచ్చ పిచ్చ టాస్కులతో ఒక దారి తెన్ను లేని రీతిలో షో సాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. షో నుంచి ఎలిమినేట్ అయిన వారిని కొంగొత్త పద్దతిలో రీ ఎంట్రీ ఇప్పించటం ఒక ఎత్తు అయితే.. నూతన్ నాయుడ్ని రీరీఎంట్రీ ఇప్పించటం మరో ఎత్తు. ఈ సోది చాలదన్నట్లు కౌశల్ ఆర్మీ అంటూ రచ్చ రచ్చగా సాగటమే కాదు.. షోను డిసైడ్ చేసేది బిగ్ బాస్ కాదు.. కౌశల్ ఆర్మీ అన్న పేరు వచ్చేసిన దుస్థితి.
ఇలాంటి వేళ.. బిగ్ బాస్ నిర్వాహకులు నిద్ర లేచినట్లుగా చెబుతున్నారు. ఎవరు షోలో ఉండాలో.. ఎవరు ఉండకూడదో అన్నట్లుగా పక్కా వ్యూహంతో ఓటింగ్ చేస్తూ ఇప్పటివరకు షోను ఒక ఆట ఆడుకుంటున్న కౌశల్ ఆర్మీకి షాకులిచ్చే ప్రయత్నాన్ని ఎట్టకేలకు బిగ్ బాస్ షురూ చేసినట్లుగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో షో నడుస్తుందని చెబుతున్నారు. సామాన్యుడన్న ట్యాగ్ లైన్ తో బండి లాగించిన గణేశ్ శనివారం ఎలిమినేట్ అయిపోయాడు. మరో ఎలిమినేషన్ ఈ రోజు ఉంది. గడిచిన కొద్ది వారాలుగా ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు ఎంట్రీ ఇస్తారో అన్న విషయాలపై ఎప్పటికప్పుడు బయటకు వచ్చే లీకులకు తగ్గట్లే ఈ ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో బయటకు వచ్చేసింది.
కౌశల్ మీద పీకల వరకూ కోపంతో ఉన్న బిగ్ బాస్ కౌశల్ ను దెబ్బ తీసేలా.. అతడికి ఫుల్ సపోర్ట్ అన్నట్లు ఉండే నూతన్ నాయుడ్ని ఎలిమినేట్ చేయనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో కౌశల్ కు స్క్రీన్ టైమ్ ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అతడు బ్యాడ్ అయ్యే అవకాశం ఉన్నకంటెంట్ ను ఎక్కువగా టెలికాస్ట్ చేస్తారన్న మాట కూడా వినిపిస్తోంది. కౌశల్ యాంటీ ఓట్ ను ఏకం చేసే వ్యూహంలో భాగంగానే బిగ్ బాస్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. షోను తమ చేతుల్లోకి తీసుకున్న కౌశల్ ఆర్మీకి షాకిచ్చేలా బిగ్ బాస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది. మరి.. ఇందుకు కౌశల్ ఆర్మీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.