గత సీజన్ ఇంతకు ముందు సీజన్ లను చూస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షో ను పెద్ద ఇంట్రెస్ట్ గా మల్చిందే లేదు. గత సీజన్ లో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ మరీ దారుణంగా వారంకే వెనక్కు వెళ్లి పోవడం జరిగింది. అందుకే ఈసీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఆసక్తిని కలిగించే విషయం. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది చాలా కామన్ విషయం. కాని ఈసారి మొదటి రోజే 19 మందిని పంపించారు కనుక అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల షో ఇంట్రెస్ట్ పెంచేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్న ప్రతి సారి కూడా నిరాశే మిగులుతుంది. కనుక ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండక పోవచ్చు అనేది సోషల్ మీడియా టాక్. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్వాహకులు ఈసారి ఇద్దరిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం అనుకున్నా కూడా చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు అనేది టాక్.
ప్రతి సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఉండాలి.. జరగాలి అనడానికి ఏమీ లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ సీజన్ కు కొత్త కొత్త రూల్స్ వస్తూనే ఉంటాయి. ప్రేక్షకుల్లో ఆటపై ఆసక్తిని పెంచేందుకు కొత్తగా చూపించేందుకు నిర్వాహకులు క్రియేటివ్ టీమ్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందులో భాగంగానే బిగ్ బాస్ సీజన్ 5 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు లేకుండా ప్లాన్ చేశారేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం హౌస్ లో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. వారికి సరిపోయేంత మంది అబ్బాయిలు లేరు. కనుక ఒకరు లేదా ఇద్దరు అబ్బాయిలను పంపించాల్సిందిగా నిర్వాహకులకు నెట్టింట విజ్ఞప్తులు అందుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ మొదటి రోజే ఎంట్రీ ఇచ్చారు. అంత మాత్రాన వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకుండా ఉండొచ్చు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు వైల్డ్ కార్డులను తీసుకున్నా కూడా ఒకటి రెండు వారాల పాటు డబుల్ ఎలిమినేషన్ ను ప్లాన్ చేయవచ్చు. నిర్వాహకులు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే. మరి నిర్వాహకులు ఏమనుకుంటున్నారో చూడాలి. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.