ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ బిగ్ బాస్ రియాల్టీ షో మొదలైంది. మొత్తం 17 మంది ఇంటి సభ్యులు ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ బయటకు వచ్చిన పేర్లే ఫైనల్ అయ్యాయి. డిస్నీ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ గా మొదలైన ఈ బిగ్ బాస్ ఓటీటీ థీమ్ రానున్న రోజుల్లో మరింత రచ్చ చేయటం ఖాయమన్న విషయం.. ఎంట్రీలోనే తేలిపోయింది. ఆరంభంలోనే ఇద్దరు ముద్దుగుమ్మల నోటి నుంచి వచ్చిన మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి.
మొత్తం 17 మందిలో పది మంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉంటే.. ఏడుగురు మాత్రమే మేల్ కంటెస్టెంట్లు ఉండటం ఓటీటీ బిగ్ బాస్ ప్రత్యకతగా చెప్పాలి. హోస్ మేట్స్ ఎంపికలోనూ రోటీన్ బిగ్ బాస్ కు భిన్నంగా వ్యవహరించారు. కొన్ని కొత్త ముఖాలు.. మరిన్ని గతంలో బిగ్ బాస్ షోలో రాణించి.. వార్తల్లో నిలిచిన వారిని ఎంపిక చేసుకోవటం గమనార్హం. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉండాలి? ఎలా తమ గేమ్ ను పదును పెట్టాలి? ఓట్లను సొంతం చేసుకోవాలన్న దానిపై అవగాహన ఉన్న వారే ఎక్కువ మంది ఉండటంతో ఆట మామూలుగా ఉండదన్న మాట వినిపిస్తోంది.
ఈ అంచనాకు తగ్గట్లే.. ఎంట్రీలోనే అదరగొట్టేశారు ఇద్దరు భామలు. తమకు సంబంధించిన షాకింగ్ అంశం.. ఇప్పటివరకు ఎవరికి తెలియని విషయాన్ని ఒకరు చెబితే.. మరొకరు ఆరంభంలోనే హౌస్ లోకి వెళ్లినంతనే తన తోటి కంటెస్టెంట్ కు షాకిచ్చే మాటను అనేయటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. ఐదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ స్రవంతి చొక్కారపు అయితే.. మరొకరు పదకొండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చిన మిత్ర శర్మ.
సోషల్ మీడియాతో మొదలైన యాంకర్ స్రవంతి ప్రయాణం.. ఇప్పుడు టీవీ వరకు వచ్చి.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరికి తెలియని సీక్రెట్ ను రివీల్ చేసింది. అనంతపురంలోని కదిరి నుంచి వచ్చిన ఆమె.. తానను ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకున్నానన్న విషయాన్ని బయటపెట్టారు. మొదటిసారి ప్రేమ పెళ్లి చేసుకోగా.. రెండోసారి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పి.. ఈ విషయం ఎవరికీ తెలీదన్నారు. తన నవ్వు గరించి రోజుకో వంద కామెంట్లు రావటం ఖాయమన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించిన ఆమె.. హౌస్ లో నవరసాలు పంచటం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేసింది.
ఇక.. తొలి సంధ్య వేళలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మిత్ర శర్మ విషయానికి వస్తే.. పలు సినిమాలు చేస్తున్న ఆమెది ముంబయి. హైదరాబాద్ కు వచ్చిన ఆమె ఆ మధ్యన శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసుుకొని.. బాయ్స్ మూవీతో నిర్మాతగా మారింది. ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో.. యాంకర్ చైతూను అన్నయ్య అని పిలిచి అతగాడి నోట మాట రాకుండా చేసింది. ఆమె పిలుపునకు చైతూ నోట మాట రాని పరిస్థితి. రానున్న రోజుల్లో హౌస్ మేట్స్ కు మరెన్ని షాకులు ఇస్తుందో చూడాలి.