తెలివైన దాయాది ఎప్పుడూ తెలివితక్కువ పని చేయకూడదు. ఈగోలకు.. పంతానికి పోతే ఆ నష్టం దారుణంగానే ఉంటుంది. ప్రస్తుతం పాక్ సన్నివేశం అలానే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ సినిమా ఒకే ఒక్క దెబ్బకు కుదేలైపోయింది. పుల్వామా దాడి అనంతరం తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు.. ఏరివేత వల్ల ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది కేవలం సరిహద్దుల వరకే పరిమితం కాదు. అన్ని రంగాలపైనా తీవ్రంగా పడుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ సినిమాని భారత్ నిషేధించింది. ఇక్కడ థియేటర్లలో పాక్ సినిమా రిలీజ్ చేయడానికి అనుమతిని నిరాకరించింది. దీంతో పాకిస్తాన్ సినీఇండస్ట్రీకి చావు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ సినిమాలకు బాలీవుడ్ వల్ల రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. తాజా నిషేధంతో అంతా పోయినట్టే. ఇప్పట్లో పాక్ సినీపరిశ్రమ కోలుకోవడం అంత సులువేం కాదు.
అయితే పాక్ అందుకు ప్రతీకార చర్యగా.. ఇండియన్ సినిమాల రిలీజ్ లను పాకిస్తాన్ లో లేకుండా ఆపేస్తూ ప్రకటన గుప్పించింది ఆ ప్రభుత్వం. అయితే దీనివల్ల బాలీవుడ్ కి వచ్చే నష్టమేమీ లేదు. పాక్ మొత్తంగా కేవలం 130 థియేటర్లలోపే ఉన్నాయిట. వాటిలో ఆడకపోతే బాలీవుడ్ కి వచ్చే నష్టం ఏంటి? అన్న చర్చ సాగుతోంది. పాకిస్తాన్ లో ఏడాదికి వంద సినిమాలు రిలీజవ్వడం కష్టం. అలాంటిది బాలీవుడ్ లో వందలాది సినిమాలు తెరకెక్కి.. పాక్ లో రిలీజవుతున్నాయి. దీనివల్ల బోలెడంత ఆదాయం - పన్నుల రూపంలో పాకిస్తాన్ కు జనరేట్ అవుతోంది. అదంతా ప్రస్తుతానికి జీరో అయిపోయినట్టే. మధ్యంతరంగా ఇలా సినీపరిశ్రమపై దెబ్బ పడిపోవడం పాక్ కి డైజెస్ట్ కానిది అని విశ్లేషిస్తున్నారు.
ఇక ఇండియాలో పాకిస్తాన్ సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటే ఆరు వేలకు పైగా సింగిల్ స్క్రీన్లు .. రెండు వేల మల్టీప్లెక్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్క నిషేధంతో సినిమా రిలీజ్ లన్నీ గల్లంతయిపోయాయి. పాక్ డిస్ట్రిబ్యూటర్లు .. నిర్మాతలకు సెగ తాకింది. ఇండస్ట్రీ గల్లంతయిపోయింది అక్కడ. పాకిస్తాన్ లో సల్మాన్ నటించిన సుల్తాన్ టాప్ గ్రాసర్ జాబితాలో నిలిచింది. వరల్డ్ వైడ్ గా 600 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం పాకిస్తాన్ లో 37 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అయితే పాక్ -ఇండియా మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఆ ప్రభావం పలురకాల ఇండస్ట్రీస్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. కొంతకాలం తర్వాత తిరిగి సత్సంబంధాలు ఏర్పడితే అటుపై తిరిగి యథాతథ స్థితికి వస్తుంది సన్నివేశం.