పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ ఏయమ్ రత్నం నిర్మిస్తున్నాడు. మొఘలాయుల కాలం నాటి ఫిక్షనల్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపిస్తాడని సమాచారం. కెరీర్ లోనే తొలిసారి కొత్త జోనర్ లో నటిస్తున్న పవన్ కల్యాణ్.. దీని కోసం గుర్రపు స్వారీతో పాటు కత్తిసాము కూడా చేయబోతున్నాడట. ఇకపోతే ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
మొఘల్ చరిత్రలో చక్రవర్తి ఔరంగజేబు పాత్ర ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత్ర కోసం అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో క్రిష్ కు ఉన్న పరిచయాలతో ఆయనను ఒప్పించారని అనుకుంటున్నారు. అలానే పాన్ ఇండియా లెవల్లో రూపొందే ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ యాక్టర్ కూడా ఉంటే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కోసం సుమారు రూ.180 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందే సినిమా అని చెప్పవచ్చు.