కరోనా మహమ్మారీకి సాక్షాత్తూ దైవమే అతీతం కాదు. తాజా సన్నివేశం చూస్తున్న సామాన్య ప్రజలు ఒణికిపోతున్నారు. ఎక్కడికక్కడే బంద్. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావడం లేదు. ఇక కరోనాకి సినీ సెలబ్రిటీలు బాధితులు కావడంతో ప్రచారం మరింతగా వేడెక్కిపోతోంది. పలువురు హాలీవుడ్ తారలు ఇప్పటికే కరోనా భారిన పడ్డారు. టామ్ హ్యాంక్... ఆయన భార్య రీటా విల్సన్ కూడా కరోనా బారిన పడిన సంగతి విదితమే. బాలీవుడ్ ఫేమస్ సింగర్ కనికా కపూర్ కు కరోనా సోకిందని వైద్యులు తేల్చి చెప్పారు. వీరితోపాటు ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోయి తన అభిమానులకు కంటి మీద కునుకులేకుండా చేసే `జేమ్స్ బాండ్` నటి ఓల్గా కురిలెంకోకి కూడా కరోనా పాజిటివ్ అని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే తనకు వైద్యులు కేవలం పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని.. ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదని వెల్లడించింది.
అయితే ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. దీనిపై ఓల్గా స్వయంగా తన అనుభవాన్ని చెబుతూ అభిమానులు ప్రజలకు పలు సూచనలు చేయడం విశేషం. ``నాకు వైద్యులు టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. అంతా అయిపోయాక కేవలం జ్వరం పెరిగినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమని వైద్యులు చెప్పారు. అంతకు మించి ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదు. అంతేకాదు ఇంటికి వెళ్ళి ఒంటరిగా గదిలో ఉండాలని సూచించారు. అలానే నేను మా ఇంట్లో అందరికి దూరంగా ఉంటున్నా. కానీ కరోనా వైరస్ ని ఎదుర్కొనడానికి మనవంతు ప్రయత్నం చేయాలి`` అని తెలిపింది.
విటమిన్ బీ5.. విటమిన్ ఈ.. విటమిన్ సీ.. జింక్ ఎంతగానో సహకరిస్తాయి. నేను ఇవి వాడాక నా జ్వరం తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని ముందస్తుగా వాడితే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకునే ఛాన్స్ ఉంద``ని తెలిపింది. ఓల్గా సూచనలకు.. కరోనాని ధైర్యంగా ఎదుర్కోవడాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇకపోతే వైద్యుల నిర్లక్ష్యాన్ని బాండ్ గాళ్ బయటపెట్టిన తీరును ప్రశంసించి తీరాల్సిందే. ఇదంతా సరే కానీ .. ఓల్గాకి కరోనా పాజిటివ్ అని తేలగానే బోయ్ ఫ్రెండ్ బెన్ క్యూరా తనతో బ్రేకప్ చెప్పేశాడన్న ప్రచారం ఊపందుకుంది.