న‌డుము చుట్టుకొల‌త‌ ఏమైంది బాబోయ్?

Update: 2021-03-25 05:37 GMT
డెడికేష‌న్ అంటే రాశీ.. రాశీ అంటే డెడికేష‌న్! అందుకు ప్రూఫ్ ఇదే. స‌రిగ్గా ఏడాది క్రితం రాశీ ఖ‌న్నా ఎలా ఉండేది..? ఇప్పుడెలా ఉంది? అంటే ఇదిగో ఈ మేకోవ‌ర్ చూస్తే మీరే గెస్ చేయొచ్చు.

కేవ‌లం ఈ ఏడాదిలో సుమారు 10కేజీల బ‌రువు త‌గ్గిపోయిన రాశీ ఖ‌న్నా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆక‌ట్టుకుంటున్నారు. మేకోవ‌ర్ కోసం జిమ్ యోగా అంటూ రాశీ హార్డ్ వ‌ర్క్ నిరంత‌రం చూస్తున్న‌దే. రాశీ తాజా లుక్ మ‌రోసారి యువ‌త‌రాన్ని షాక్ కి గురి చేస్తోంది.

రాశీ పూర్తిగా స్లిమ్మ‌య్యింది. ఆ న‌డుము చుట్టూ ఫ్యాట్ అమాంతం మాయ‌మైంది. పైగా ఒక హాలీవుడ్ బ్యూటీని త‌ల‌పించేలా తీరైన రూపం క‌నిపిస్తోంది. చూస్తుంటే మార‌థాన్ త‌ర‌హాలో జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో శిక్ష‌ణ పొంద‌డం వ‌ల్ల .. క్ర‌మం త‌ప్ప‌ని డైట్.. యోగా వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని అర్థ‌మ‌వుతోంది. శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో ఫ్యాట్ ని త‌గ్గించ‌డం కంటే న‌డుము చుట్టూ ఉన్న‌ది త‌గ్గించాలంటే అధికంగా శ్ర‌మించాలి. కానీ రాశీ హార్డ్ వ‌ర్క్ చూస్తుంటే ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేం.

రాశీ న‌టించిన త‌మిళ చిత్రం సైతాన్ కా బ‌చ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది. ఆర‌ణ్మ‌యి 3- తుగ్ల‌క్ ద‌ర్బార్- మేధావి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. భ్ర‌మం అనే మ‌ల‌యాళ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ క‌ర్త‌లు రాజ్ అండ్ డీకే తెర‌కెక్కించే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ స‌ర‌స‌న రాశీ న‌టించ‌నుంది. షాహిద్ తో ఇంత‌కుముందు ఫోటోషూట్ లో పాల్గొంది రాశీ.
Tags:    

Similar News