సూపర్ హిట్ సినిమా లేదా సూపర్ హిట్ నటుడు బ్రాండ్ వ్యాల్యూ భారీగా ఉంటుంది. హిట్ అయిన సినిమా పేరుతో ఏదైనా బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తే ఏ స్థాయిలో దానికి పబ్లిసిటీ దక్కుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బాహుబలి సినిమా పేరుతో తమ బ్రాండ్ కు ఆ సినిమాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తే ఏ స్థాయిలో ఆ బ్రాండ్ యొక్క విలువ పెరుగుతుందో తెల్సిందే.
ఇప్పుడు కన్నడ సినిమా కేజీఎఫ్ హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా కూడా కన్నడ కేజీఎఫ్ సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా ఏకంగా ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను బ్రేక్ చేసింది. అలాగే బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డు వసూళ్లను దంగల్ ను క్రాస్ చేసి కొత్త రికార్డును నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇంకా ఎన్నో రికార్డులు నమోదు చేసిన కేజీఎఫ్ సరికొత్త బిజినెస్ మొదలు అయ్యింది.
కేజీఎఫ్ అనగానే హీరో యశ్ పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో యశ్ ఒక సన్నివేశంలో ఉపయోగించి పోలీస్ స్టేషన్ ను నేల మట్టం చేసిన మిషన్ గన్ గుర్తుకు వస్తుంది. మరి కొందరికి రాఖీ భాయ్ వాడిన కారు గుర్తుకు వస్తే మరి కొందరు కేజీఎఫ్ 1 లో యశ్ ఉపయోగించిన బైక్ గుర్తుకు వస్తుంది. ఇలా కేజీఎఫ్ అనేగానే కొన్ని థింగ్స్ ను ప్రేక్షకులు నెమరవేసుకుంటారు.
ఇప్పుడు దాన్నే ఒక బిజినెస్ గా మార్చేశారు. కేజీఎఫ్ లోని యశ్ పోజ్ తో విగ్రహాలకు కన్నడ నాట విపరీతమైన డిమాండ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేవలం ఆ ఒక్క విగ్రహం మాత్రమే కాకుండా ఇంతకు ముందు మనం చెప్పుకున్న కారు.. గన్.. బైక్ ఇంకా పలు కేజీఎఫ్ మోడల్స్ ను ఇప్పుడు బహిరంగ మార్కెట్లో భారీ రేట్లకు అమ్ముతున్నారు.
దేశవ్యాప్తంగా ఈ విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంది. కేజీఎఫ్ గుర్తుగా అని కొందరు పెట్టుకుంటూ ఉంటే.. మరి కొందరు ఇంటీరియర్ డిజైన్ కు ఉపయోగపడుతున్నాయి అంటూ కొనుగోలు చేస్తున్నారు. కేజీఎఫ్ విగ్రహాలను పెట్టుకోవడం వల్ల రిచ్ నెస్ యాడ్ అవుతుందని కొందరు.. పాజిటివ్ వైబ్స్ అంటూ మరి కొందరు ఆయా విగ్రహాలను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.