మజిలీకి ద్వితీయ విఘ్నం టెన్షన్

Update: 2019-03-25 17:30 GMT
నాగ చైతన్యకు అర్జెంటుగా హిట్టు పడాల్సిన తరుణంలో వస్తున్న మూవీగా మజిలి మీద అభిమానులు గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. టీజర్ వచ్చేసింది. ఆడియో పూర్తిగా అందుబాటులో ఉంది. ప్రియతమా అనే స్లో మెలోడీ తప్ప మ్యూజిక్ లవర్స్ కు గొప్పగా ఎక్కేసిన ట్రాక్ ఏదీ లేదనే కామెంట్స్ వస్తున్నాయి. విజువల్ గా చూసాక అభిప్రాయాలు మారతాయేమో చూడాలి.

సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిశ్రమలో దర్శకుడు శివ నిర్వాణ పరంగా ఒక అంశం ఫ్యాన్స్ కు టెన్షన్ కలిగిస్తోంది. అదే ద్వితీయ విఘ్నం. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో అధిక శాతం డెబ్యు దర్శకులకు రెండో మూవీ ఫ్లాప్ గా నిలిచింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే పైకి కనిపించకపోయినా లోపల దీని గురించి ఆలోచించేవాళ్ళు లేకపోలేదు

అలా అని ఇది ప్రతి ఒక్కరికి అనుభవమని కాదు. రాజమౌళి-కొరటాల శివ-బోయపాటి శీను-అనిల్ రావిపూడి వీళ్ళంతా ఈ గండం నుంచి తప్పించుకున్నవాళ్ళే. అయితే గమనించాల్సిన అంశం మరొకటి ఉంది. వీళ్ళందరి రెండో సినిమా ఊర మాస్ మసాలాలు. అవి కూడా స్టార్లతో తీసినవి. ఒక్క అనిల్ మాత్రమే తేజుతో చేశాడు. కమర్షియల్ కోణంలో అన్ని పక్కాగా కుదిరినవి.

కాని శివ నిర్వాణ తీసుకుంది సెన్సిటివ్ లైన్. భార్యా భర్తల ఎమోషన్స్ ని ఆధారంగా చేసుకుని తీసినది. ఆ యాంగిల్ లో చూస్తే శివ నిర్వాణ ఇది కనక దాటేస్తే ట్రెండ్ కు ఎదురీదినట్టే. చాలా కాలం డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు మజిలి ఎలాంటి ఉత్సాహం తెస్తుందో చూడాలి
Tags:    

Similar News