పాక్ సినీ న‌టుల‌కు వీసాలు వ‌ద్ద‌నేశారు

Update: 2019-02-27 08:22 GMT
భార‌త సినిమాల్ని పాక్ లో విడుద‌ల కానివ్వ‌మంటూ పాక్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు ప్ర‌క‌టిస్తే.. దానికి స్పంద‌న‌గా ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ కొత్త డిమాండ్‌ను తెర మీద‌కు తెచ్చింది. పాక్ అక్ర‌మిత క‌శ్మీర్ లో భార‌త వైమానిక ద‌ళం జ‌రిపిన మెరుపుదాడుల నేప‌థ్యంలో భార‌త సినిమాలు పాక్ లో విడుద‌ల కాకుండా పాక్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

దీనిపై ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా ప్ర‌ధాని మోడీకి ఒక లేఖ రాశారు. భార‌త సినిమాలు పాక్ లో విడుద‌ల చేయ‌కుండా ఆ దేశం నిషేధం విధించిన నేప‌థ్యంలో పాక్ న‌టీన‌టుల‌కు వీసాలు ఇవ్వొద్దని కోరింది.

పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులు అంద‌కుండా చేయ‌టంతో పాటు పాక్ న‌టుల‌కు వీసాలు ఇవ్వ‌కుండా బ్యాన్ విధించాల‌ని ప్ర‌ధానిని ఆయ‌న కోరారు. ఈ లేఖ‌పై భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.
Tags:    

Similar News