బాహబలి ది కంక్లూజన్.. రాజమౌళి టీం అంతా ఈ రెండో భాగానికి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉంది. భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే.. బాహుబలి మొదటి భాగానికి సంబంధించిన సంచలనాలు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇండియాకి మించి భారీ స్థాయిలో బాహుబలి చైనీస్ వెర్షన్ రిలీజ్ కి రెడీ అయింది.
చైనాలో ఏకంగా ఆరున్నర వేల థియేటర్లలో జూలై 22న విడుదల కానుంది. ఈ డేట్ ని.. రిలీజ్ అప్ డేట్స్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు బాహుబలి చైనా డిస్ట్రిబ్యూటర్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు డైలీ లో ఇవాళ ఓ కార్టూన్ వచ్చింది. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన బాహుబలి కార్టూన్ కి మంచి స్పందన లభించింది. చైనాలో బాహుబలి అనే పేపర్ కనిపిస్తుంటే.. పక్కన ప్రభాస్ ఓ చైనా డ్రాగన్ ని భుజంపై పెట్టుకుని కనిపిస్తాడు. సినిమాలో ఉండే శివలింగం ఎత్తే సీన్ కి బదులుగా.. చైనీయుల డ్రాగన్ ని రీప్లేస్ చేశారన్న మాట.
బాహుబలి ది బిగినింగ్ ఇప్పుడు ఈ స్థాయిలోనే అక్కడ రిలీజ్ అవుతుంది. లోకల్ భారీ చిత్రాలకు సమానంగా విడుదల కానుండడమే.. తెలుగు డైలీలో ఇలాంటి కార్టూన్ రావడానికి కారణంగా చెప్పచ్చు. సింపుల్ గా ఒక పంచ్ తో ఇంటెన్సిటీని క్యారీ చేసే కార్టూనిస్ట్ శ్రీధర్.. బాహుబలి చైనా విడుదల కార్టూన్ విషయంలో ఇదే రేంజ్ లో సక్సెస్ అయ్యారని చెప్పచ్చు.