'నెమ్మదిగా ఇల్లు కొట్టేసే ప్లాన్ వేస్తున్నారేంటి?'.. బావతో బాలయ్య ఫన్నీ టాక్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ''అన్ స్టాపబుల్'' టాక్ షో కోసం హోస్టుగా మారిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కాబడిన ఈ షో డిజిటల్ స్పేస్ లో సూపర్ సక్సెస్ అయింది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ బాలయ్య లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. దీంతో అందరూ రెండో సీజన్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు.
ఈ నేపథ్యంలో 'అన్ స్టాపబుల్ విత్ NBK' సీజన్-2 ని మరిన్ని హంగులతో మరింత ఎంటర్టైనింగ్ గా సిద్ధం చేసింది ఆహా టీమ్. ఎన్నడూలేని విధంగా టాక్ షో కోసం స్పెషల్ గా ట్రైలర్ ను లాంచ్ చేసారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ వీడియో విశేష స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ ఈరోజు శుక్రవారం మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది.
'అన్ స్టాపబుల్ 2' షోకు మొదటి గెస్టుగా బాలయ్య బావ, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు లైఫ్ - ఎన్టీఆర్ తో పరిచయం - పొలిటికల్ కెరీర్ లోని అంశాలను స్పృశిస్తూ ఈ ఎపిసోడ్ సాగింది. బాలయ్య తనదైన శైలి ప్రశ్నలతో బావను ఆట పట్టించే ప్రయత్నం చేసారు.
'మిమ్మల్ని బావ గారు అని పిలవాలా? చంద్రబాబు నాయుడు గారు అని పిలవాలా? ప్రేమగా బావ అని పిలవనా?' అంటూ చమత్కారంగా ఈ ఎపిసోడ్ ని ప్రారంభించారు బాలకృష్ణ. దీనికి చంద్రబాబు స్పందిస్తూ 'ఏది చెప్పినా మీరు మీదే చేస్తారు కదా' అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఎన్టీఆర్ తో పరిచయం గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పటి వరకూ పేపర్లో సినిమాల్లో చూసాను.. అంజయ్య క్యాబినెట్ లో నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కర్టసీ కింద ఆయన్ని కలిశాను.
ఆరోజు రామకృష్ణ స్టూడియోస్ లో 'అనురాగదేవత' సినిమాలోని శ్రీదేవి తో వెడ్డింగ్ సీన్ షూటింగ్ జరుగుతోందని.. ఫస్ట్ మీటింగ్ లో ఒక గంటన్నర పాటు మాట్లాడుకున్నామని చంద్రబాబు చెప్పారు. సినిమాలు చూడకపోతే స్టూడెంట్స్ స్టూడెంట్సే కాదు.. స్టూడెంట్ లైఫ్ లో ఎన్టీఆర్ - అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసేవాడిని అని తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి ప్రస్తావించారు.
1978లో ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చా. నా మ్యారేజ్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లున్న ప్రదేశానికి మా మామగారు తీసుకొచ్చి.. 'నువ్వు ఒప్పుకుంటే ఇక్కడ నీకు ఇల్లు కడతాను' అని అన్నారుని చంద్రబాబు చెప్పారు. దీనికి బాలయ్య 'నెమ్మదిగా ఇల్లు కొట్టేసే ప్లాన్ వేస్తున్నారేంటి బావా?' అంటూ నవ్వులు పూయించారు. నీకంటే ఫస్ట్ ఆ ఇల్లు మీద రైట్ నాదే అని చంద్రబాబు ఫన్నీ కౌంటర్ వేయగా.. 'అల్లుడిగా అన్ని హక్కులు మీవే' అని బాలకృష్ణ నవ్వించారు.
'జూబ్లీ హిల్స్ ప్రదేశం అప్పట్లో నిర్మానుష్యంగా ఉండేదని.. చుట్టూ ఇల్లులు లేవు.. రోడ్లు లేవు.. ఇక్కడ ఉంటే అడవిలో ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు వద్దులే అని అన్నాను. ఆ తర్వాత నీకోసం ఆ ఇల్లు కట్టాడు. ఫస్ట్ నాకు చెప్పి, నేను కాదంటే నీకోసం కట్టాడు' అని చంద్రబాబు చెప్పగా.. 'హమ్మయ్య.. ఫైనల్ గా నాదే చేసారు' అని బాలయ్య నవ్వుతూ అన్నారు.
ఆ తర్వాత ఎన్నికల్లో తాను ఓడిపోయానని.. అప్పుడు ఇల్లు లేదని.. మెహదీపట్నంలోని 2 బెడ్ రూమ్స్ ఉండే చిన్న ఇంట్లో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. ఒకరోజు పెద్దాయన పిలిచి 'బాలకృష్ణ కోసం ఇల్లు కట్టాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు.. నువ్వు మూడు నాలుగేళ్లు అక్కడే ఉండొచ్చు' అని చెప్పారు. అప్పుడు నేను వచ్చి ఆ ఇంట్లో ఉన్నాను. అప్పుడే హైదరాబాద్ ని అభివృద్ధి చేయాలనే ప్రగాఢమైన కోరిక ఏర్పడిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.