తెలుగునాట నెల రోజుల్లోనే రెండు పెద్దసినిమాలు విడుదలయ్యాయి. ఒకటి మహేష్ హీరోగా చేసిన భరత్ అను నేను రెండోది అల్లు అర్జున్ నా పేరు సూర్య. ఆ రెండు సినిమాలు చూసిన వాళ్లకి కామన్ పాయింట్స్ కొన్ని తప్పక కనిపిస్తాయి. రెండు సినిమాలు ఒకే కోవకు చెందినవి అనిపిస్తుంది. రెండు సినిమాలు సమాజంలో బాధ్యత కల ఇద్దర వ్యక్తుల కథే. ఇద్దరూ సమాజం కోసం ఏదో ఒక మంచి చేయాలన్న భావనతో ఉన్న వారే.
భరత్ అను నేనులో హీరో ముఖ్యమంత్రి. తాను పనిచేయడమే కాదు అందరిచేత పనిచేయించాలనుకునే రకం. జనాలకు ఏదో ఒక మంచి చేయాలని భావిస్తాడు. ఇక సూర్య సినిమాలో హీరో ఒక జవాను. దేశం కోసం దేశంలోని ప్రజల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. ఇద్దరూ సమాజంలో మంచిని పెంపొందించడానికి కష్టపడతారు. అలాగే భరత్‌లో ఎవరికైనా ప్రామిస్ చేస్తే దానిని ఎలా అయినా నిలబెట్టుకోవాలనే పంతం మీద ఉంటాడు హీరో. ఇక సూర్యలో ఒక మనిషికి క్యారెక్టర్ పోతే ప్రాణమే పోయినట్టు భావిస్తాడు హీరో. వీరిద్దరి తమ తమ అభిప్రాయాలకు విలువిచ్చారు. వాటిని నిలబెట్టుకునేందుకే ప్రయత్నించారు. ఇద్దరిలోనూ సిన్సియారిటీ కనిపిస్తుంది.
రెండు సినిమాలు వినోద ప్రాధాన్యంలేని సినిమాలు. అంటే సీరియస్ కోవలోకి వచ్చేవన్నమాట. రెండు సినిమాలు డైరెక్టర్లు మొదట్నించి ఆ సీరియస్ నెస్ కి సినిమా చివరి వరకు కట్టుబడి ఉన్నారు. ఎక్కడా మధ్యలో వెకిలి కామెడీలను చొప్పించలేదు. అదే ఈ సినిమాలకు కాస్త మైనస్ అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే... సినిమాను మళ్లీ మళ్లీ చూసే ప్రేక్షకులు ఇలాంటి మూవీలకు తక్కువ ఉంటారు. సీరియస్‌గా ఉండే సినిమాను ఒక్కసారి చూసే సరిపెట్టుకుంటారు ప్రేక్షకులు.