మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఖాళీగా ఉంటే టైంపాస్ వీడియోల్ని అభిమానులకు షేర్ చేస్తుంటారు. అయితే కొన్నినెలలుగా చరణ్ అన్ని రకాల మీడియాకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా భార్య ఉపాసనతో దేవుడికి పూజ చేస్తోన్న ఫోటో మినహా ఇంకెలాంటి అప్ డేట్ అవ్వలేదు.
ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా గ్రూప్ ఫోటో లో మాత్రమే చరణ్ కనిపించారు. చరణ్ వ్యక్తిగతంగా స్పె షల్ ప్లాన్స్ ఎక్కడా కనిపించలేదు. చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' కోస్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం మీడియా మీట్స్ లో యమా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఆ మధ్య అన్నయ్య కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ప్రమోషన్ కోసం బయటకొచ్చారు.
సినిమా ప్రీమియర్ కి కుటుంబ సమేతంగా విచ్చేసారు. ఇక రాజమౌళి సైతం మీడియాలో అంతే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 'బ్రహ్మస్ర్త' ప్రమోషన్ లో జక్కన్న ఎలాంటి హుషారుతో పాల్గొంటున్నారో తెలిసిందే. సౌత్ లాంగ్వజెస్ లో జక్కన్న ఆ చిత్రాన్నికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తెన్నారు. దీనిలో భాగంగా వివిధ సిటీలకు తిరుగుతున్నారు.
ఇంకా తారక్-రాజమౌళి సైతం వ్యక్తిగతంగా తమ ఇళ్లలలో కలుస్తున్నారు. అయితే వీటిలో ఎక్కడా చరణ్ కనిపించలేదు. వాస్తవానికి బ్రహ్మాస్ర్త ప్రమోషన్ కోసం రాజమౌ చరణ్ ని తీసుకొస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ ఛాన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు. కేవలం తానొక్కడే ప్రచారం చేసుకుంటున్నారు. మరి చరణ్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్లు? ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ సమయంలో అన్ని మీడియా సంస్థల్ని చుట్టేసిన చరణ్ ఇప్పుడు అజ్ఞాతం దేనికి కొనసాగిస్తున్నట్లు? అంటే ఆసక్తికర చర్చే సాగుతుంది.
చరణ్ సరిగ్గా 'ఆచార్య' రిలీజ్ దగ్గర నుంచే మీడియాలో ఎక్కడా కనిపించలేదు. టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుల్ని కలిసిన సందర్భం లేదు. తన సినిమా షూటింగ్ చేసుకోవడం.. ఇంటికి వెళ్లడం తప్ప ఇంకెలాంటి కార్యక్రమాల్లో చరణ్ పాల్గొనలేదు. మధ్యలో సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్..కమల్ హాసన్ లు మాత్రం చిరంజీవి ఇంటికి హాజరైతే? వాళ్లతో మాట మంతి చేసినట్లు తెలుస్తోంది.
'ఆచార్య' సినిమా చరణ్ ని బాగా డిస్టబెన్స్ కి గురి చేసిందని ఆ కారణంగానే మీడియాకి దూరంగా ఉంటున్నట్లు వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో? అయినా ఇదంతా గతం. 'ఆచార్య' రిలీజ్ అయి నెలలు గడుస్తుంది. ఆ సినిమా గురించి అభిమానులు సహ అంతా మర్చిపోయారు. చరణ్ మళ్లీ మునుపటిలా ఉండాలంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ -శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.