మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా' తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా కేటగిరీలో సక్సెస్ చేసేందుకు అమీర్ చేయని ప్రయత్నం లేదు. నాగార్జున వారసుడు నాగచైతన్యను ఒక కీలక పాత్రకు ఎంపిక చేయడమే గాక.. మెగాస్టార్ చిరంజీవితో కావాల్సిన ప్రమోషన్స్ చేయిస్తున్నారు.
అదంతా అటుంచితే అమీర్ తో ఎంతో స్నేహం ఉన్నా కానీ మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో కామియో కోసం సల్మాన్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అన్నదానికి తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో జవాబు వచ్చింది. మీ (తెలుగు ప్రేక్షకుల) కోసం ఏదైనా చేయమని.. నాక్కూడా అవకాశం ఇవ్వమని నేను చిరంజీవిగారిని అడుగుతున్నాను!! అని అమీర్ ఖాన్ ఈ వేదికపై అన్నారు.
దానికి చిరు 'నేను మీకు కాల్ చేస్తాను' అని చెప్పారట ఆ ఫోన్ సంభాషణలో. ఆ మాట అన్న తర్వాత రెండు రోజులకు చిరు అమీర్ ఖాన్ కు తాను సల్మాన్ ఖాన్ తో షూటింగ్ చేస్తున్నానని చెప్పారట. అయితే చిరు తనను ఎందుకు ఎంపిక చేయలేదో.. సల్మాన్ నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పాలని అమీర్ అన్నారు. చిరు స్పందిస్తూ.. ఇది మెదడు లేదా హృదయంతో నటించేది కాదు.. శారీరకంగా బాగా చూపించాలి... అందుకే సల్మాన్ ను ఎంపిక చేసుకున్నాం అని అన్నారు.
అయితే చిరు చేసిన ప్రకటన సౌండింగ్ వేరుగా వినిపించింది. అమీర్ చేసే సినిమాలు మాత్రమే హృదయం మెదడు ఉపయోగించి చేసేవి.. ఇతరులవి కావు! అన్న విధంగా కొందరు అర్థం చేసుకున్నారు. కానీ చిరు మీనింగ్ అది కాదు. అమీర్ ఖాన్ ఎంపికలు ఎమోషనల్ కంటెంట్ తో ఉంటాయి.. అందుకు భిన్నంగా సల్మాన్ ఖాన్ భారీ గా కండలు ప్రదర్శిస్తూ యాక్షన్ సినిమాలు చేస్తాడు! అన్నదే ఆయన భావన. ఇది అర్థం చేసుకునేవారిని బట్టి మారుతుంది.
చిరంజీవి- అమీర్ కాంబినేషన్ సాధ్యమేనా?
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి భవిష్యత్ లో ఒక మల్టీస్టారర్ చేసేందుకు ఆస్కారం ఉందా? అంటే ..లేదు అని చెప్పలేం. ఆ ఇద్దరూ బలంగా అనుకుంటే ఇది సాధ్యమేనని మెగాభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతోంది. సౌత్ మార్కెట్లో బాలీవుడ్ హీరోలు వెలగాలంటే కచ్ఛితంగా తమ సినిమాల్లో సౌత్ హీరోల కోసం పెద్ద పాత్రలను క్రియేట్ చేయాల్సిన సన్నివేశం కనిపిస్తోంది.
ఖాన్ ల త్రయం ఇప్పటికే ఆ దిశగా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అమీర్ ఖాన్ కూడా ఇటీవల ప్లాన్ మార్చారని అతడి మాట తీరు.. వాలకం చెబుతోంది. అందువల్ల సాధ్యమైనంత తొందర్లోనే మెగాస్టార్ తో అమీర్ సినిమాకి అవకాశం ఉంటుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆశించినది జరుగుతుందేమో వేచి చూడాలి.