సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయారంగ్రేట్రం సర్వత్రా చర్చనీయాంశమైంది. నేడు రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా తలైవర్ అభిమానులు తమిళనాడు అంతటా భారీ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రతియేడాది పుట్టినరోజు వేరు.. ఈ ఏడాది పుట్టినరోజు వేరు. ఈసారి రజినీ అభిమానులకు ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకమైనది. ఆయన రాజకీయారంగేట్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు 2020 డిసెంబర్ 31 న ముహూర్తం ఖరారైంది. రజినీ నుండి రాజకీయ పార్టీ ప్రకటన వెలువడనుంది.
దీంతో కోలీవుడ్ టాలీవుడ్ సహా జాతీయ స్థాయిలో దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక టాలీవుడ్ నుంచి రజనీ స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలియజేశారు. చిరు తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెప్పారు.
``ప్రియమైన మిత్రుడు రజనీకాంత్ కు 70 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అద్భుతమైన జీవితం కావాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో ప్రవేశిస్తున్నందున మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీదైన ప్రత్యేక శైలి తో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వారికి సేవ చేయడంలో కూడా ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తారని నమ్ముతున్నాను! ధన్యులు`` అని చిరంజీవి ట్వీట్ చేశారు. కొన్నేళ్ల క్రితం తాను రజనీకాంత్ ఒకేసారి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నామని ఓ ప్రయివేట్ కార్యక్రమంలో తెలిపారు. కానీ తెలియని కారణాల వల్ల రజిని అప్పుడు వెనక్కి తగ్గారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా రజనీకి విషెస్ తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు రజనీకాంత్ సర్! మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ.. సినిమాలో శైలిని పునర్నిర్వచించడాన్ని కొనసాగించండి. మీకు మంచి ఆరోగ్యం.. ఆనందం .. శాంతి ఉండాలని కోరుకుంటున్నాను! ”అని మహేష్ ట్విట్టర్ లో కోరారు. పలువురు సెలబ్రిటీలు రజనీకి బర్త్ డే శుభాకాంక్షలతో పాటు రాజకీయారంగేట్రంపైనా విషెస్ తెలిపారు.