ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు.. వ్యాపారవేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారు ఉంటున్నారు. వారి వారి వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం తో పాటు సామాజిక విషయాలను ఇంకా తమ వృతిపరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
రేపు ఉగాది సందర్బంగా తాను సోషల్ మీడియా లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా స్వయంగా చిరంజీవి ఒక వీడియో బైట్ ను విడుదల చేసి ప్రకటించాడు. ఇక పై నా భావాలను నా అభిప్రాయాలను మీతో షేర్ చేసుకోవడానికి అలాగే నేను అనుకున్న మెసేజెస్ లు కాని చెప్పాలనుకున్న విషయాలను మీతో చెప్పుకోవడానికి సోషల్ మీడియా సరైన వేదికగా భావిస్తు నేను ఇక మీదట సోషల్ మీడియాలో కి ఎంటర్ అవుతున్నాను అదీ ఈ ఉగాది రోజు నుండి అంటూ చిరంజీవి వీడియో బైట్ లో పేర్కొన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆయనకు వెల్ కమ్ మెగాస్టార్ టు సోషల్ మీడియా అనే హ్యాష్ ట్యాగ్ తో స్వాగతం పలుకుతున్నారు. ట్విట్టర్.. ఇన్ స్టా ఇంకా ఫేస్ బుక్ ల్లో చిరంజీవి రేపు మొదటి పోస్ట్ లు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ కు నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్.
Full View Full View