టాలీవుడ్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని షూటింగ్ ప్రారంభానికి ముందే అంచనాలను క్రియేట్ చేసిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి తన గ్రాండ్ రీఎంట్రీ తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఎంచుకోవడం ఒక కారణం అయితే.. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ కావడం.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నుంచి పలు భాషలకు చెందిన స్టార్స్ నటిస్తుండడం ఇందుకు కారణాలు.
సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రకటన ఆగస్టులోనే వచ్చింది. ఇప్పుడీ చిత్రం షూటింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. డిసెంబర్ 6నుంచి సైరా మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయిపోయాయి. ముంబై నుంచి ఓ స్పెషల్ మేకప్ టీం కూడా హైద్రాబాద్ లో సిద్ధంగా ఉంది. ప్రతీ పాత్రధారికి మేకప్ వేయించి.. టెస్ట్ షూట్ నిర్వహించి.. ఆయా పాత్రలకు సరితూగుతారనే పూర్తి విశ్వాసం కలిగిన తర్వాతే షూటింగ్ ప్రారంభిస్తుండడం విశేషం.
హైద్రాబాద్ పరిసరాల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం స్క్రిప్ట్ నుంచి.. లొకేషన్స్ సహా అన్ని పనుల్లోనూ దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన రీసెర్చ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేషనల్ రేంజ్ లో ఇప్పటికే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం కావడంతో.. ఫుల్ ప్లెడ్జెడ్ గా తన అంతా సైరా కోసం కేటాయించేస్తున్నాడు సురేందర్ రెడ్డి.