సీనియర్ హీరో రాజశేఖర్ కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో పోరాడుతున్న రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని.. ఐసీయూలో నాన్ ఇన్ వాసివ్ వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు. ఈరోజు రాజశేఖర్ కు ప్లాస్మా థెరపీ కూడా చేశామని.. సైటోసోర్బ్ పరికరం ద్వారా చికిత్స చేస్తున్నామని వైద్యులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడిందని.. వైద్యానికి స్పందిస్తున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవల రాజశేఖర్ తో పాటు ఆయన సతీమణి జీవిత, ఇద్దరు కుమార్తెలు శివాత్మిక - శివానీలకు కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే కొన్ని రోజులకు జీవిత - శివాత్మిక శివానీలు కరోనా నుంచి బయటపడ్డారు. ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ కూడా కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. ఈ మధ్య ఆమెకు చేసిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Full View Full View Full View