'కోబ్రా' సెకండ్ లుక్: ప్రతి సమస్యకు గణిత పరిష్కారం ఉంటుందంటున్న విక్రమ్..!

Update: 2020-12-25 07:47 GMT
దక్షిణాది అగ్ర కథానాయకుడు విక్రమ్ కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన పాత్రల్లో విభిన్న గెటప్‌ లలో కనిపిస్తూ వస్తున్నాడు. సినిమా కోసం ప్రాణం పెట్టే నటులలో ఒకడిగా గుర్తింపు పొందిన చియాన్ విక్రమ్.. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ''కోబ్రా'' అనే మరో కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్. ఆర్.అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన విక్రమ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు క్రిష్మస్ సందర్భంగా 'కోబ్రా' నుంచి విక్రమ్ మరో లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తాజాగా విడుదలైన 'కోబ్రా' సెకండ్ లుక్ లో విక్రమ్ పొడవాటి మరియు గజిబిజి జట్టుతో కనిపించాడు. అంతేకాకుండా అతని సగం మెదడులో ఎన్నో అంకెలు సమస్యలు ఉన్నట్లు చూపించారు. ఈ పోస్టర్ ద్వారా 'ప్రతీ ప్రాబ్లమ్ కి మ్యాథమాటికల్ సొల్యూషన్' ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొత్త లుక్ విక్రమ్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కేఎస్‌ రవికుమార్‌ - శ్రీనిధి శెట్టి - మృణాలిని - కనికా - పద్మప్రియ - బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 2021 మేలో విడుదల చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News