హార‌ర్ జోన‌ర్లో ఆ భామ‌లిద్ద‌రి మ‌ధ్య పోటీ!

Update: 2022-11-27 02:30 GMT
లేడీ ఓరియేంటెడ్  చిత్రాల్లో స‌త్తా చాట‌డానికి అవ‌కాశం వ‌చ్చిన హీరోయిన్లంతా ఏ రేంజ్లో చెల‌రేగుతారో చెప్పాల్సిన  ప‌నిలేదు. అలాంటి పాత్ర‌లు రావ‌డ‌మే అరుదు.  వ‌చ్చిన ఎలాంటి అవ‌కాశాన్నిమిస్ చేసుకోరు. రెండు..మూడు సినిమాలు చేస్తే వ‌చ్చే పారితోషికం ఇలాంటి సినిమా ఒక్క‌టి చేస్తే చాలు. రెట్టింపు పారితోష‌కం అందుకోవ‌చ్చు . పైగా గుర్తింపు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. మార్కెట్ ప‌రంగానూ స్థాయి పెరుగుతుంది.

అందుకే  స్టార్ హీరోయిన్లు అంతా  ఉమెన్ సెంట్రిక్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ లో ఓ ఇద్ద‌రి మ‌ల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొందా? ఇద్ద‌రు మ‌ధ్య  నువ్వా నేనా అన్న‌రీతిలో సీన్ వెడెక్కుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది.

హాట్ బ్యూటీ న‌య‌న‌తార ఇప్ప‌టికే కొన్ని హార‌ర్ చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటింది.  మాయా..ఐరా..డోరా లాంటి చిత్రాల‌తో  అమ్మ‌డు ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఈ మూడు విజ‌యాలు న‌య‌న్ కి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ని తీసుకొచ్చాయి. త్వ‌ర‌లో'క‌నెక్ట్'  అనే సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని  భ‌య‌పెట్ట‌డానికి రెడీ అయింది.

అలాగే భ‌ర్త విగ్నేష్ శివ‌న్ ఆమెలో ఆస‌క్తిని గ‌మ‌నించి ఏకంగా భారీ బ‌డ్జెట్ తోనే తానే నిర్మాత‌గా మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రాన్ని న‌య‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. భార్య‌పై ఎంతో ప్రేమ‌తో నిర్మిస్తోన్న చిత్ర‌మ‌ది.  ఇంకా న‌య‌న్ నుంచి మ‌రిన్ని అద్భుతాలు రాబ‌ట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. పెళ్లైన త‌ర్వాత భార్య‌పై మ‌రింతగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నాడు.

ఇక ఇదే వేవ్ లో చంద‌మామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్  కూడా దూసుకుపోతుంది. అమ్మ‌డు 'ఘోస్టీ' అనే ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో న‌టిస్తోంది. ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం  భ‌య‌పెట్టే కంటెంట్ ఉన్న సినిమాగా మీడియాలో హైలైట్ అవుతోంది.

అలాగే'కురుంగా ప్పియ‌మ్' అనే మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాలో కూడా న‌టిస్తుంది.  ఇందులో కాజ‌ల్ అతీంద్రీయ శ‌క్తులున్న యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఈ సినిమాపై యూనిట్ దీమాగా ఉంది. ఇలా ఇద్ద‌రు హీరోయిన్లు ఒకేసారి రిలీజ్ క రాక‌పోయినా హార‌ర్ చిత్రాలు చేస్తోన్న హీరోయిన్ల‌గా ఫేమస్ అవుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News