వీహెచ్ గొడవంతో వివాదం చెలరేగి, రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్టులతో ఆసక్తి చెలరేగి, దర్శకుడి ప్రతిభ, హీరో నట విశ్వరూపంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న “అర్జున్ రెడ్డి” సినిమా మరో వివాదంలో చిక్కుకుంది.
ఈ సినిమా కథ నాదని, గతంలో తాను తెరకెక్కించిన 'ఇక సె..లవ్' సినిమా కథనే యథాతథంగా తెరకెక్కించారని ఖమ్మం జిల్లాకు చెందిన దర్శకుడు డి.నాగరాజు అంటున్నాడు. దీనికి సంబంధించి అర్జున్ రెడ్డి సినిమా నిర్మాత - దర్శకులకు అతను నోటీసులు కూడా పంపించాడు. తన అనుమతి లేకుండా ఈ సినిమా తీసినందుకు తనకు రూ.2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే చట్టపరమయిన చర్యలు తీసుకుంటానని నోటీసులో పేర్కొన్నాడు.
ఈ సినిమా కథ తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారు చేసుకున్నదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటున్నాడు. తాజా వివాదం నేపథ్యంలో అర్జున్ రెడ్డి కథ కాపీనా ? కాదా ? అన్నది తేలాల్సి ఉంది. విజయవంతమయిన సినిమాలకు ఇలాంటి కేసుల బెడద ఉంటుంది. ఈ నోటీసు కూడా ఆ కోవలోనిదేనా ? లేక నిజంగానే కాపీ చేశారా అన్నది వేచిచూడాలి.