ఈ వార్ సీన్ కాపీయే అంటారా!!

Update: 2017-05-03 16:23 GMT
మామూలుగా ''ది 300'' ''ట్రాయ్'' ''అలగ్జాండర్'' వంటి సినిమాలను చూసి ''బాహుబలి'' కోసం రాజమౌళి అనేక సీన్లను డిజైన్ చేశాడని ఎవరైనా కూడా ఇట్టే చెప్పేస్తారు. అయితే ఎప్పుడూ వీటినుండే దించితే.. మిగలిన టివి సీరీస్ లు ఏమైపోతాయ్? అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా జనాలు. ఆల్రెడీఎ ''గేమ్ ఆఫ్‌ థ్రోన్స్'' సీరియల్ నుండి చాలా ఐడియాలను తీసుకున్న రాజమౌళి అండ్ టీమ్.. మరో టివి సిరీస్ లోని సీన్లను కూడా దించేశారని వీరు ఆరోపిస్తున్నారు.

అమెరికన్ టెలివిజన్ లో ''మార్కోపోలో'' అంటూ ఒక 10 ఎపిసోడ్ల సిరీస్ వచ్చేది. రెండు సంవత్సరాల్లో రెండు సీజన్లను ప్రసారం చేశాక.. ఈ సిరీస్ తో భారీ లాస్ వచ్చిందని.. అందుకని దీన్ని ఆపేస్తున్నాం అని పేర్కొంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ. అయితే ఈ సిరీస్ లోని ఒక వార్ సీక్వెన్స్ ను తీసుకుంటే.. శత్రువులను చెదరగొట్టడానికి గుర్రాలకు నిప్పంటించి వాటిని శత్రువుల స్థావరాల్లోకి వదులుతారు. సేమ్ టు సేమ్ ఇప్పుడు బాహుబలి 2 సినిమాలో కూడా కుంతల రాజ్యాన్ని కాపాడటానికి కట్టప్ప కూడా ఆవులు గెదెల కొమ్ములకు నిప్పంటించి వాటిని శత్రుమూకలు మీదకి వదులుతాడు. అందుకే ''మార్కోపోలో''లో ఈ సీన్ తాలూకు వీడియో చూపించి.. రాజమౌళి ఇది కాపీ కొట్టేశాడు అంటూ జనాలు హడావుడి చేస్తున్నారు.

అయితే ఎద్దుల కొమ్ములకు నిప్పంటించి ఇలా శత్రువులపై దాడి చేయడం అనేది భారత దేశంలో చాలామంది రాజులు అనాధిగా పాటించిన ఒక యుద్ద పద్దతి. దీనిని కాపీ అనడంలో పెద్దగా అర్ధం లేదేమో.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News