కరోనా టాలీవుడ్ పైనా పడిందా? అంటే అవుననే తాజా సీన్ చెబుతోంది. టాలీవుడ్ ని కరోనా ఓ రేంజులో భయపెడుతోంది. డ్యామేజ్ చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోతున్న సంగతి తెలిసిందే. వైరస్ మహమ్మారీ చాప చుట్టేస్తుండడంతో అన్ని దేశాలు అప్రమత్తమై చైనా నుంచి రాకపోకలను నిషేధించాయి. ఎంత ముఖ్యమైన పనులైనా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాలపైనా పడినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాంకాక్..థాయ్ లాండ్..సింగపూర్ లో ఎక్కువగా మన షూటింగ్ లు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కరోనా భయంతో ఆ దేశాలు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రాన్ని థాయ్ లాండ్ లో షూట్ చేయాల్సి ఉంది. కానీ కరోనా భయం కారణంగా షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు వైల్డ్ డాగ్ షూటింగ్ కొంత భాగం అక్కడ జరిగింది. ఆ షూటింగ్ కి కంటిన్యుటీ లో భాగంగా నే మళ్లీ థాయ్ లాండ్ వెళ్లాల్సి ఉంది. ఇక సంచలనాల రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న `ఎంటర్ ది గర్ల్ డ్రాగన్` షూటింగ్ చైనాలో చేయాల్సి ఉంది. మార్షల్ ఆర్స్ట్ నేపథ్యం సినిమా కాబట్టి మేజర్ పార్టు షూటింగ్ అంతా అక్కడే చేయాల్సి ఉంది. ఐదారు నెలలు పాటు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కరోనా దెబ్బకి వర్మ వెనకడుగు వేసి మూడు నెలలు పాటు చైనా జోలికి వెళ్లకూడదని కామ్ గా ఉన్నారు.
తాజాగా ఈ జాబితాలో మరో టీమ్ కూడా చేరిపోయింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అంతా అడవిలోనే కథంతా సాగుతుంది. అయితే ఇక్కడ అడవులు షూటింగ్ కి అనుకూలంగా లేని కారణంగాను...తిరుమల శేషాచలం అడవుల్లో అనుమతలు దొరకని నేపథ్యంలోనూ సుకుమార్ యూనిట్ తో బ్యాంకాక్ అడవుల్లో చిత్రీకరణకు సిద్దమవుతున్నారు. కానీ కరోనా విజృంభణ కారణంగా సుక్కు ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కరోనా కు ఎదెరెళ్లడం అంటే యూనిట్ సభ్యుల అందరి ప్రాణాలను పణంగా పెట్టినట్లే నని భావించి సుక్కూ వెనక్కి తగ్గారుట. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత బ్యాంకాక్ షెడ్యూల్ ప్లాన్ చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారుట.
అదీ ప్రస్తుతం టాలీవుడ్ పై కరోనా ఎఫెక్ట్. కారణాలు ఏవైనా కరోనా దెబ్బకి టాలీవుడ్ సినిమా షూటింగ్ లు మొత్తం వాయిదా పడ్డాయి. డబ్బు వృథా అయిపోతోంది కానీ ఏదీ ప్లానింగ్ ప్రకారం జరగడం లేదు. కరోనా వైరస్ కి టీకా రావాలంటే మరో 18 నెలలు సమయం పడుతుందని డబ్ల్యూ.హెచ్.వో ప్రకటించింది. అయితే వచ్చేది సమ్మర్ కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్ది కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో వైరస్ మనుగడ కష్టమే కావడం భారత్ కి లాభించే విషయం.