కోవిడ్ -19 పాజిటివ్ అని తెలిశాక మలైకా అరోరా స్వీయ దిగ్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుని తన కుటుంబంతో తిరిగి కలిసినట్లు తెలుస్తోంది. తాజాగా తన పడకగది నుండి మలైకా ఓ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. “తిరిగి కలుసుకున్నారు” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో మలైకా పాదాలతో పాటు ఆమె కుక్క కాస్పర్ కనిపిస్తోంది. పప్పీ మంచంపైనే ఉంది. ఆమె సారా జెస్సికా పార్కర్ నటించిన ఒక మూవీని చూస్తోంది. తన బాల్కనీ నుండి వీక్షణను కూడా ఆనందిస్తోంది.
మలైకా తన క్వాంటైన్ ఫోటోల్లో ఆమె కుమారుడు అర్హాన్ తన కుక్క కాస్పర్ బాల్కనీ నుండి తనను చూస్తున్నట్లుగానూ ఉంది. “ప్రేమకు హద్దులు లేవు. మా సామాజిక దూరం స్వీయ నిర్బంధంలో, మేము ఇప్పటికీ ఒకరినొకరు పరామర్శించుకున్నాం అని మలైకా తెలిపింది. మరికొన్ని రోజులు నా ఇద్దరు పిల్లలను కౌగిలించుకోలేక పోతే నా గుండె ముక్కలవుతుంది! వారి అందమైన ముఖాలను చూడటం వల్ల నాకు చాలా ధైర్యం శక్తి లభిస్తుంది అంటూ మలైకా ఎమోషన్ అయ్యింది.
మలైకా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇండియా బెస్ట్ డాన్సర్ షో కోసం షూటింగ్ లో ఉన్నారు. ఆమె ఎలా జాగ్రత్త పడిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. “అదృష్టవశాత్తూ నా కుటుంబం వైరస్ బారిన పడలేదు. నాకు పాజిటివ్ అని తెలియగానే షాక్ అయ్యాను ఎందుకంటే నాకు పెద్దగా లక్షణాలు లేవు. అసౌకర్యంగా కూడా లేను. ఇంట్లో స్వీయ దిగ్బంధనం చేయమని నాకు సలహా ఇచ్చారు. దాంతో నేను నా గది నుండి బయటికి రాలేదు. నా కొడుకు (అర్హాన్), ఇంటి సిబ్బంది మరియు మా కుక్క కాస్పర్ తో సహా ఎవరితోనూ కలవలేదు`` అని తెలిపింది.
ఇక కరోనా తన ఫిట్ నెస్ దినచర్యను ఎలా ప్రభావితం చేసిందో మలైకా వెల్లడించింది, అయితే ఈ కాలంలో కనీసం కొన్ని ప్రాథమిక శ్వాస వ్యాయామాలు చేయాలనుకున్నా. “నాకు ఊపిరాడని సమస్య లేదు. కానీ కొన్ని తేలికపాటి లక్షణాలు కనిపించాయి. ఆ బలహీనత గురించి ఫిర్యాదు చేసాను. ఇది మీ శరీరం ఒక వ్యాధితో పోరాడుతున్నప్పుడు జరుగుతుంది. నేను బలహీనంగా ఉన్నందున నా యోగా దినచర్యను అభ్యసించలేకపోయాను. కేవలం ప్రాథమిక ఆసనాలను ప్రయత్నించాను. అనులోమ్ విలోమ్ మరియు కపాలభాతి వంటి శ్వాస వ్యాయామాలను అభ్యసించాను`` అని తెలిపింది.