అల వైకుంఠపురంలో చిత్రంతో గత ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా కరోనా మహమ్మారి వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను ముగించేసిన దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం నటీ నటుల ఎంపికకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ తో పాటు సినిమా లోని ఒక ముఖ్యమైన లేడీ లీడ్ కు గాను త్రివిక్రమ్ అన్వేషిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లేడీ పాత్ర కు గాను క్రాక్ సినిమాలో జయమ్మ పాత్ర చేసి మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ ను సంప్రదించారంటూ వార్తలు వస్తున్నాయి.
క్రాక్ సినిమా లో జయమ్మ వంటి పాత్ర ఎన్టీఆర్ 30 సినిమా లో ఉంటుందట. మద్య వయస్కురాలైన ఒక పవర్ ఫుల్ లేడీ పాత్రకు గాను వరలక్ష్మి శరత్ కుమార్ ను పలువురు త్రివిక్రమ్ కు సూచించగా అందుకు త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలుగు నుండి వరుసగా వరలక్ష్మి కి ఆఫర్లు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ తెలుగు సినిమాకు ఇటీవలే ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమా లో కీలక పాత్రలో నటిస్తే వరలక్ష్మి స్టార్ డం మరింతగా పెరగడం ఖాయం. ఎన్టీఆర్ 30 సినిమా లో కనిపించిన తర్వాత వరలక్ష్మి టాలీవుడ్ లో మరింత బిజీగా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అన్ని విషాయలు క్లారిటీగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.