కొత్తదనం కోసం స్టార్ హీరోల క్రాస్ చెక్

Update: 2022-03-28 08:30 GMT
చిన్న సినిమా హీరో నుంచి టాప్ హీరో వరకూ తమ సినిమాలు రిలీజ్ అయిన రోజు విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందోనని తెగ వర్రీ అయిపోతుంటారు. అయితే ఇప్పుడు అదే టెన్షన్ లో ఉన్నారు మెగా స్టార్ చిరంజీవి. ఐదు సినిమాలతో ఎంగేజ్ లో ఉన్న చిరు... ప్రస్తుతం మోహన్ రాజాతో గాడ్ ఫాదర్ చేస్తున్నారు.

మెహర్ రమేష్ తో వేదాళం సినిమా రీమేక్ అయిన భోళా శంకర్ చిత్ర షూటింగ్ ని స్పీడప్ చేశారు. బాబీతో మరో మాస్ మూవీ చేస్తున్నారు. వీటితో పాటు వెంకీ కుడుములతో మరో సినిమాకు కమిట్ అయ్యారు. వీటిలో అన్నీ ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే అందులో ఏదైనా మిస్ అవుతుందేమోనంటూ స్క్రిప్టును మరోసారి రీచెక్ చేస్కునే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్డెరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. ఒక సినిమాలో ఉన్నట్లు మరో సినిమాలో ఉంటే ఆడియన్స్ అస్సలు అక్సెప్ట్ చేయడం లేదు. ట్రిపుల ఆర్ లో చరణ్ తనలోని అగ్రెసివ్ యాంగిల్ చూపించారు. కాబట్టి శంకర్ రామ్ చరణ్ లోని మరో కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపించాలని భావిస్తున్నారట. అంతే కాకుండా ప్రేక్షకులకు నచ్చేనా ఉండేలా చూపించేందుకు తెగ కష్టపడుతున్నారట. ఈ సినిమాలే కాకుండా సౌత్ లో రాబోతున్న పెద్ద సినిమాలు మణిరత్నం పొన్నియున్ సెల్వన్, సూర్య.

అజిత్, కమల్ హాసన్, సినిమాలన్నీ భారీగానే తెరకెక్కుతున్నాయి. అయితే ప్రీవియస్ సినిమాల రిజల్ట్ ని బట్టి స్టోరీ బెటర్ మెంట్స్ చేసుకుంటూ... ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతోందో అని టెన్షన్ పడుతున్నారు.

రజినీ కాంత్ లాంటి సీనియర్ స్టార్లు కూడా ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి తమ సినిమాల్ని రొటీన్ గా కాకుండా ఆడియన్స్ కి నచ్చేలా మళ్లీ మళ్లీ స్టోరీని చెక్ చేసుకుంటున్నారు. ఇలా పెద్ద హీరోలైనంత మాత్రాన, పాన్ ఇండి సినిమాలు అయినప్పటికీ... వందల కోట్ల బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమా సూపర్ హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. కాబట్టి పెద్ద సినిమా స్టార్ లు అందరూ సినిమా రిలీజ్ రోజు వరకూ ఆడియన్ రెస్పాన్స్ కోసం తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే ఒకప్పటిలా ప్రేక్షకులు పెద్ద సినిమా, చిన్న సినిమా అని కాకుండా కాన్సెప్ట్ కొత్తగా ఉంటే చాలు అనుకుంటున్నారు.

తక్కువ బడ్జెట్, కొత్త హీరోలు అయినప్పటికీ.. కథ బాగుంటే సూపర్ హిట్ అవుతుంది. అలా వచ్చినవే అర్జన్ రెడ్డి, జాతి రత్నాలు, డీజే టిల్లు సినిమాలు. ఒక్క సినిమాతోనే ఆ హీరోలు స్టార్ హీరోల స్థాయికి చేరిపోవడానికి కారణం కొత్త కథతో పాటు... ప్రేక్షకులకు నచ్చే డిఫరెంట్ ఎలిమంట్స్ యే కారణం అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వారంతా పెద్ద సినిమాలు, టాప్ హీరోలనే విషయాన్ని పక్కన పెట్టి కథను ప్రేక్షకులకు నచ్చే రీతిలో మలుస్తున్నారు.
Tags:    

Similar News