ఆ ఇద్ద‌రి క్లారిటీతో ఈ ఇద్ద‌రి డైల‌మా క్లియ‌ర్!

Update: 2019-11-21 08:50 GMT
ఒకే సీజ‌న్ లో నాలుగైదు సినిమాలు రిలీజ‌వుతున్నాయంటే పోటీ అనివార్యం. థియేట‌ర్ల స‌మ‌స్య‌తో రిలీజ్ టెన్ష‌న్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా స‌మ‌స్య‌లెన్నో. బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఓపెనింగులు రికార్డులు వగైరా సాధ్యం కాదు. ఫ్లాప్ అన్న టాక్ వ‌స్తే పోటీలో వ‌చ్చినందుకు మొత్తం ప్లాన్ బెడిసికొట్టిన‌ట్టే. అందుకే మ‌న నిర్మాత‌లు తెలివైన గేమ్ ఆడుతున్నారు. సోలో రిలీజ్ అన్న ప్రాతిప‌దిక‌న వ‌చ్చి మినిమం జ‌నాల జేబుల్లోంచి లాగేస్తున్నారు.

అయితే ఈసారి సంక్రాంతికి మాత్రం ఈ అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని ఆందోళ‌న నెల‌కొంది. కేవ‌లం నాలుగైదు రోజుల్లోనే నాలుగు సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో ఇబ్బందిక‌ర స‌న్నివేశం ఉంద‌నే భావిస్తున్నారు. వెంక‌టేష్ లాంటి స్టార్ న‌టించిన సినిమా సంక్రాంతి రేసులో యాడ‌వుతోంది అన‌గానే కొంత టెన్ష‌న్ త‌ప్ప‌లేదు. అయితే వెంకీ-చైతూ న‌టించిన వెంకీ  మామ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుని డిసెంబ‌ర్ 13న రిలీజ్ లాక్ అయ్యింది. దీంతో చాలా వ‌ర‌కూ క్లారిటీ వ‌చ్చేసింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ద‌ర్బార్ కి సైతం ఎదుట ఉన్న రిలీజ్ ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌న‌వ‌రి 9 వ తేదీ రిలీజ్ ని ఫిక్స్ చేసుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పెద్ద సినిమాల‌కు క్లారిటీ వ‌చ్చేయ‌డంతో ఇక మిగ‌తా ఇద్ద‌రికీ కూడా పూర్తిగా లైన్ క్లియ‌రైన‌ట్టేన‌ని భావించ‌వ‌చ్చు. సంక్రాంతి బ‌రిలో ఇద్ద‌రు పెద్ద హీరోలు పూర్తి క్లారిటీతో పెద్ద‌రికం నెరిపార‌నే దీనిని బ‌ట్టి భావించాల్సి ఉంటుంది.

దీంతో సంక్రాంతి బ‌రిలో ప్ర‌ధాన‌మైన వార్ మ‌హేష్- బ‌న్ని మ‌ధ్య‌నే ఉండ‌నుంది. మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు జ‌న‌వ‌రి 11న రిలీజ‌వుతుంటే.. బ‌న్ని న‌టిస్తున్న అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. ఒక‌రోజు గ్యాప్ మెయింటెయిన్ చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రికీ అది ప్ల‌స్. ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌కు ప్రీమియ‌ర్ల‌కు అది బాగా క‌లిసొస్తోంది. ఈ న‌లుగురికి క్లారిటీ వ‌చ్చేసింది అంటున్నారు కాబ‌ట్టి ఇక క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న ఎంత మంచివాడ‌వురా రిలీజ్ కి ఓ క్లారిటీ వ‌చ్చేసింద‌ట‌. జ‌న‌వ‌రి 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అయితే నిర్మాత దిల్ రాజు వైపు నుంచి ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. డిసెంబ‌ర్ 13.. జ‌న‌వ‌రి 9.. జ‌న‌వ‌రి 11.. జ‌న‌వ‌రి 12 .. జ‌న‌వ‌రి 15 తేదీలు ఇప్ప‌టికి లాక‌వ్వ‌డంతో పోటీ ఎవ‌రి మ‌ధ్య‌న అన్న‌దానిపైనా అభిమానుల‌కు పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. హిట్టు బొమ్మ అన్న టాక్ వ‌స్తే ఆ సినిమాకి సంక్రాంతిలో భారీగా వ‌సూలు చేసే ఆస్కారం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.



Tags:    

Similar News