సూపర్ స్టార్ రజనీకాంత్ -మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'దర్బార్' సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేది ఎవరు? అంటే ఓ ముగ్గురు అగ్ర నిర్మాతల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు-ఎన్. వి ప్రసాద్- యువి క్రియేషన్స్ అలయెన్స్ బృందం ఈ చిత్రం హక్కుల కోసం బేరసారాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బేరసారాలు సాగుతున్నాయట.
సూపర్ స్టార్ రజనీతో 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోందట. సినిమా కోసం డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేస్తోందని సమాచారం. క్వాలిటీ సహా ఏ విషయంలో రాజీ లేని నిర్మాణం చేపడుతోంది. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ మాత్రం తక్కువ ధరకు అడుగుతున్నారని సమాచారం.
ఇటీవల రజనీకాంత్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. రజనీ మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యింది. మురగదాస్ మహేష్ తో తెరకెక్కించిన స్పైడర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించని సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 2.ఓ తో తెలుగు వెర్షన్ పంపిణీ దారులకు భారీగా నష్టాలు వచ్చాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకునే దర్బార్ హక్కులకు పరిమిత ధరను దిల్ రాజు అండ్ కో కోట్ చేశారట. చెప్పిన ఫిగర్ కే ఇవ్వాలని.. .రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని బేరాలు ఆడుతున్నట్లు సమాచారం. దీనికి తోడు మిగతా నిర్మాతలు పోటీ పడకపోవడంతో లైకా కూడా సానుకూలంగానే ఉందని టాక్ వినిపిస్తోంది.