కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేశాడు ప్రభాస్. ఇక దర్శకుడు దశరత్ శైలి వేరు. ఆయన క్లాస్ ఫ్యామిలీ సినిమాలే చేస్తుంటారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా తెర మీదికి వచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ఐతే ప్రభాస్ ను తనదైన శైలిలో క్లాస్ గా చూపించి మెప్పించాడు దశరథ్. ఈ సినిమాతో దశరథ్, ప్రభాస్ ఇద్దరూ కూడా తమ కెరీర్లను గాడిలో పెట్టుకున్నారు. ఐతే ఇప్పుడు దశరథ్ మళ్లీ కాస్త ఇబ్బందుల్లో కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత దశరథ్ కు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాడు. అయినప్పటికీ తమ కాంబినేషన్లో త్వరలోనే సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నాడు దశరథ్.
‘‘ప్రభాస్ నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్. సినిమాలతో సంబంధం లేకుండా తరచుగా కలుస్తుంటాం. మిస్టర్ పర్ఫెక్ట్ పూర్తయిన వెంటనే ప్రభాస్ తో ఇంకో సినిమా చేయాలనుకున్నా. కానీ కుదర్లేదు. తనతో మళ్లీ సినిమా చేయబోతున్నా. త్వరలోనే దాని వివరాలు వెల్లడవుతాయి’’ అని దశరథ్ చెప్పాడు. ఇక తన కెరీర్ గురించి దశరథ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిగా నా ప్రయాణం మొదలై 12 ఏళ్లయింది. రెండేళ్లకొకటి చొప్పున ఆరు సినిమాలు తీశా. వేగంగా సినిమాలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ మనకు నచ్చిన కథ తయారవడం.. అది నలుగురికీ నచ్చడం.. సినిమా ఓకే అయి పట్టాలెక్కడం.. సినిమా పూర్తి చేయడం.. దీనికంతటికీ టైం పడుతుంది. నా అదృష్టం ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా కథానాయకులంతా వింటారు. కథ నచ్చక చేయను అంటే అనొచ్చు కానీ.. నా కథలు వినడానికి మాత్రం ఎవరూ కాదనరు’’ అని అన్నాడు.