నాగ్ ఫ్లాప్ మూవీ గురించి డైరెక్టరేమన్నాడు?

Update: 2016-03-02 13:30 GMT
ఒకప్పుడు నాగార్జున వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఆయన్ని మళ్లీ ట్రాక్ మీదికి తెచ్చిన సినిమా ‘సంతోషం’. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఇలాంటి మంచి సినిమా అందించాడు దశరథ్. నాగ్ - దశరథ్ రెండోసారి జత కడుతున్నారంటే ఆ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ‘గ్రీకువీరుడు’ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండాఫ్ తేలిపోవడంతో సినిమా నిలబడలేదు. ఏవరేజ్ అన్న టాక్ వచ్చినప్పటికీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

ఆ ఫెయిల్యూర్ గురించి దశరథ్ దగ్గర ఇప్పుడు ప్రస్తావిస్తే.. ఆ సినిమా తాను డైరెక్ట్ చేయాల్సింది కాదని తన సన్నిహితులు చెప్పారని చెప్పాడు. ‘‘సినిమాలో సెకండాఫ్ క్వాలిటీ లేదు నిజమే. ఐతే సినిమా ఆడకపోవడానికి అదొక్కటే కారణం కాదు. కంటెంట్ ఏదో మిస్ అవ్వ‌డం వ‌ల్లే ఆడ‌లేదు అనుకుంటున్నా. సెకండాఫ్ జనాలకు కనెక్టవ్వలేదు. నాకు తెలిసిన కొందరు మిత్ర‌లు ఏమ‌న్నారంటే.. ఈ సినిమా నేను కాకుండా ఇంకెవరైనా తీసి ఉంటే బావుండేదట. నా శైలి ఏంటో తెలుసు కాబట్టి ఆ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో జనాలు ముందే ఓ అంచనాకు వచ్చేశారని, కాబట్టే నిరాశ చెందారని విశ్లేషించారు’’ అని దశరథ్ చెప్పాడు. ఐతే ఇలా ఒక శైలికి కట్టుబడకూడదనే తాను ‘శౌర్య’ లాంటి భిన్నమైన సినిమా చేశానని.. ఇందులో తర్వాతి సన్నివేశం ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులు అస్సలు ఊహించలేరని దశరథ్ చెప్పాడు.
Tags:    

Similar News