ఆరుగురు రాస్తే.. కోటి మందికి నచ్చాలి

Update: 2016-02-29 09:42 GMT
''ఇప్పుడున్న సిట్యుయేష్‌ లో కోటి మందికి నచ్చినప్పుడే సినిమా విజయ తీరాలకి చేరుతుంది. కానీ ఒక గదిలో ఆరు మంది కూర్చుని కోటి మందికి నచ్చేలా కథని సిద్ధం చేయాలి. అందులోనే అసలు సిసలు సవాల్‌ ఉంటుంది'' అంటున్నాడు దర్శకుడు దశరథ్‌. ఈయన ప్రస్తుతం దర్శకత్వం వహించిన ''శౌర్య'' సినిమా ఈ శుక్రవారం రిలీజవ్వనుంది. ఈ సినిమా రిజల్టు మీదనే దశరత్‌ తదుపరి సినిమా ఆధారపడి ఉంటుంది.

నిజానికి మిష్టర్‌ పర్ఫెక్ట్‌ సినిమాతో దశరథ్‌ పవర్‌ ఫుల్‌ గా తన క్రిటిక్స్‌కు పంచ్‌ ఇచ్చాడని అందరూ అనుకున్నారు. కాని ఆ తరువాత నాగార్జునతో ''గ్రీకు వీరుడు'' సినిమా తీసి దెబ్బతినేశాడు. అందుకే తదుపరి సినిమా ''శౌర్య'' మొదలవ్వడానికి ఇంత టైమ్‌ పట్టింది. అయితే తన కథలపై ఎవ్వరి ప్రభావమూ ఉండదని.. తాను తీసిన సినిమాను ఎవ్వరికీ చూపెట్టనని.. ఒకవేళ 80% సినిమా తీశాక తనకు ఏదైనా సీన్‌ నచ్చకపోతే మాత్రం.. వెంటనే రీషూట్‌ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు దశరథ్‌.

ఏదేమైనా కాని.. ఈ సినిమితో కేవలం దర్శకుడు దశరథ్‌ కే కాదు.. హీరో మనోజ్‌ కు.. హీరోయిన్‌ రెజీనాకు కూడా హిట్లు కావాలి. చూద్దాం ఈ సినిమా రిజల్టు ఎవరి కెరియర్‌ ను ఎలాంటి టర్న్‌ తిప్పేస్తుందో!!
Tags:    

Similar News