రకుల్‌ మూవీ తెలుగులో రీమేక్‌

Update: 2019-06-03 05:55 GMT
బాలీవుడ్‌ లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దే దే ప్యార్‌ దే' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 100 కోట్ల కలెక్షన్స్‌ ను రాబట్టిన ఈ చిత్రంలో హీరోగా అజయ్‌ దేవగన్‌ నటించగా, హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించింది. సౌత్‌ లో సక్సెస్‌ లు లేక ఢీలా పడిపోయిన ఈ అమ్మడు ఎట్టకేలకు అక్కడ సక్సెస్‌ ను దక్కించుకుంది. సినిమా కథ చాలా విభిన్నంగా సాగింది. 50 ఏళ్ల వ్యక్తి ప్రేమలో 25 ఏళ్ల యువతి పడటం.. ఆ తదుపరి పరిణామాలతో సినిమాను ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కించడం జరిగింది.

తెలుగు నేటివిటీకి కూడా దగ్గరగా ఉండే విధంగా ఈ చిత్ర కథ ఉందని టాలీవుడ్‌ వర్గాల వారు భావించారు. అందుకే ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ ను సురేష్‌ బాబు దక్కించుకున్నాడని.. త్వరలోనే వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 50 ఏళ్ల హీరో పాత్రలో వెంకటేష్‌ నటించనుండగా.. 25 ఏళ్ల హీరోయిన్‌ పాత్రను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తోనే కంటిన్యూ చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వెంకటేష్‌ కెరీర్‌ లో ఎన్నో రీమేక్‌ లు ఉన్నాయి. వెంకీ చేసిన చాలా రీమేక్‌ లు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అందుకే ఈ రీమేక్‌ కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులు కన్ఫ్యూజ్డ్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను బాగానే ఆధరిస్తారు. అందుకే దే దే ప్యార్‌ దే తెలుగు రీమేక్‌ ఆకట్టుకునే ఛాన్స్‌ ఉంది. వెంకీ తప్పకుండా మెప్పిస్తాడనిపిస్తుంది. ప్రస్తుతం 'వెంకీ మామ' చిత్రంతో బిజీగా ఉన్న వెంకటేష్‌ తదుపరి చిత్రం విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News