బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడాకా క్షణం తీరికలేని బిజీ షెడ్యూళ్లతో కెరీర్ ని సాగిస్తోంది దీపిక పదుకొనే. ఓవైపు కథానాయికగా.. మరోవైపు నిర్మాతగా రెండు పడవల ప్రయాణాన్ని దీపిక సమర్థంగానే నడిపిస్తోంది. ఇక నిర్మాతగా కొన్ని కలిసి రాకపోయినా .. ఈ క్రైసిస్ కాలంలో తాను నిర్మించిన 83 (కపిల్ బయోపిక్) లాంటి క్రేజీ సినిమాని రిలీజ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నా.. అన్నిటినీ తెలివిగా మ్యానేజ్ చేయడంలో దీపిక చాకచక్యం మెచ్చదగినది.
మరోవైపు వరుసగా పలు భారీ ప్రాజెక్టులకు ఈ లాక్ డౌన్ సమయంలో దీపిక సంతకాలు చేసింది. బిగ్ బి అమితాబ్.. హృతిక్ రోషన్ లాంటి స్టార్లతో సినిమాలకు కమిటైన దీపిక .. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమాకి సంతకం చేసింది.
ఇదంతా ఒకెత్తు అనుకుంటే దీపిక వరుస ఫోటోషూట్లు అభిమానుల్లో అంతే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఫిలింఫేర్ మ్యాగజైన్ మే నెల కవర్ పేజీపైనా దీపిక ప్రత్యక్షమైంది. దీపికలో అదే వేడి.. కిల్లర్ లుక్ తో యువతరంలోకి సూటిగా దూసుకెళ్లింది. అది బీచ్ పరిసరంలో పూల్ సైడ్ ఫోటోషూట్. దీపిక స్విమ్మింగ్ పూల్ లో ఇలా రెట్టించిన కాన్ఫిడెన్స్ తో ఫోజిచ్చింది. అయితే ఈ ఫోటోని బ్లాక్ అండ్ వైట్ లో షేడ్ చేయడంతో దానిలో డెప్త్ మరింత ఆకర్షణీయంగా మారింది.
భవిష్యత్ అంతా మహిళలదే.. ఫిల్మీ బిజినెస్ లో మహిళ ప్రస్థానం పేరుతో ఫిలింఫేర్ చక్కని కవర్ ఆర్టికల్ ని మే నెల సంచికలో ప్రచురించింది. ఫిలింఫేర్ అవార్డ్స్ (బంగ్లా)- 2020 కవరేజీ విశేషాల్ని వెల్లడించింది.