ట్రిపుల్ ఆర్ లో చాలా సీన్స్ తొల‌గించారా?

Update: 2022-03-28 09:30 GMT
దేశ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. వ‌సూళ్ల ప‌రంగా ఈ మూవీ ప‌లు రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. గ‌త మూడున్న‌రేళ్లుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.

మెగా ప‌వ‌ర్ స్టార్ మార్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన ఈ మూవీపై ప్రారంభం నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండ‌టంతో రికార్డులు తిర‌గ‌రాస్తూ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీపై కొంత మంది ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే మ‌రి కొంత మంది సినిమాలో ఇద్ద‌రు హీరోల‌కు స‌రైన ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌లేద‌ని, రామ్ చ‌ర‌ణ్ కు అధిక ప్రాధాన్య‌త నిచ్చార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా వుంటే బాలీవుడ్ టు కోలీవుడ్ వ‌ర‌కు ఎంత మంది ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేస్తున్నా ప్రేక్ష‌కులు మాత్రం అవేవీ ప‌ట్టించుకోకుండా ట్రిపుల్ ఆర్  సినిమా కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

దీంతో ట్రిపుల్ ఆర్ వ‌రుస‌గా రికార్డుల‌ని తిర‌గ‌రాస్తూ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా రికార్డుల‌తో రీసౌండింగ్ చేస్తోంది. ఈ మూవీ ర‌న్ టైమ్ చాలా లెంగ్తీ. ఈ మూవీ ర‌న్ టైమ్ 3 గంట‌లు. అయితే అస‌లు ర‌న్ టైమ్ వేరే వుంద‌ట‌. అయితే నిడివి మ‌రీ ఎక్కువ అవుతుంద‌ని భావించిన చిత్ర బృందం చాలా వ‌ర‌కు సీన్ ల‌ని సినిమా నుంచి తొల‌గించింద‌ని ఈ మూవీకి వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ చేసిన పీట‌ర్ డాప‌ర్ తాజాగా  ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

త‌ను మూడు సీన్ ల‌లో క‌నిపించాన‌ని, ఆ సీన్ ల‌తో పాటు చాలా వ‌ర‌కు స‌న్నివేశాల‌ని ఫైన‌ల్ ఎడిటెడ్ వెర్ష‌న్ లో రాజ‌మౌళి తొల‌గించార‌ట‌. అంతే కాకుండా `బాహుబ‌లి 2` కు సంబంధించిన సీన్ ల‌ని ఫైన‌ల్ స్టేజ్ లో ఏ విధంగా అయితే తొల‌గించారో అదే స్థాయిలో ట్రిపుల్ ఆర్ సీన్ ల‌ని కూడా జ‌క్క‌న్న ప‌క్క‌న పెట్టేశార‌ట‌. అలా చేసి రాజ‌మౌళి చాలా మంది ప‌ని చేశార‌ని, లేదంటే సినిమా ర‌న్ టైమ్ చాలా ఇబ్బందిగా మారేద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే ట్రిపుల్ ఆర్ కు సంబంధించి తొల‌గించార‌ని పీట‌ర్ తెలిపిన సీన్ ల‌ని ఎప్పుడు టీమ్ రిలీజ్ చేస్తుంది? ఇంత‌కీ తొల‌గించిన సీన్ ల‌లో ఏముంది?.. ఎవ‌రి సీన్ ల‌ని రాజ‌మౌళి తొలగించారు? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదిలా వుంటే `మ‌గ‌ధీర‌` కోసం ఇండియా వ‌చ్చిన వీఎఫ్ ఎక్స్ నిపుణుడు పీట‌ర్ అప్ప‌టి నుంచి రాజ‌మౌళి రూపొందించిన ప‌లు చిత్రాల‌కు వీఎఫ్ ఎక్స్ విభాగంలో వ‌ర్క్ చేస్తూ వస్తున్నారట‌.
Tags:    

Similar News