యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్ల నుంచీ `ఆర్ఆర్ఆర్` చిత్రంపైనే ఫోకస్ పెట్టారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం కొద్ది నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. అనేక వాయిదాల అనంతరం ఈ మూవీని మార్చి 25న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.
ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రమిది. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ తార అలియా భట్ హీరోయిన్గా నటించబోతోందని టాక్. ఇదిలా ఉంటే.. కొరటాల ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను మున్నెప్పుడూ చూడని సరి కొత్త లుక్‌లో చూపించాలని భావిస్తున్నాడట.
ఈ నేపథ్యంలోనే బరువు తగ్గాలని కొరటాల డిమాండ్ చేశాడట. దాంతో ఎన్టీఆర్ తగ్గక తప్పడం లేదు. అసలే పాపం `ఆర్ఆర్ఆర్` లో కొమరం భీమ్ పాత్ర కోసం కాస్త లావెక్కని ఆయన.. ఇప్పుడు సన్నగా మారడం కోసం జిమ్‌లో చెమటలు చిందేలా కసరత్తులు చేయడం ప్రారంభించారట. అలాగే కఠినమైన డైట్‌ను కూడా ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్న ఈ మూవీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.