నాగ్-నాని మల్టీస్టారర్ కి టైటిల్ అదేనట

Update: 2018-07-02 17:02 GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు ఏ స్థాయిలో తెరకెక్కుతున్నాయో అందరికి తెలిసిందే. అందుకు సంబంధించిన వార్తలు కూడా రోజు ఎదో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. ప్రతి సినిమా ఎదో ఒక కొత్తదనం తో రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక నాగార్జున - నాని మల్టీస్టారర్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

ఇక లేటెస్ట్ అప్డేట్ కి వస్తే.. సినిమా టైటిల్ ఏమిటనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు గాని ప్రస్తుతం కొన్ని టైటిల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారి హిట్టు సినిమాపై ఇటీవల చర్చలు జరినట్లు సమాచారం. ఏఎన్నార్  కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన దేవదాసు టైటిల్ ను ఈ మల్టీస్టారర్ కి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.   

త్వరలో సినిమాకు సంబంధించిన ఎదో ఒక న్యూస్ తో క్రేజ్ తేవాలని అనుకుంటున్నారు.  ప్రస్తుతం సినిమాలో ఎంతో కీలకమైన ఎమోషనల్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.  కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి.అశ్వినిదత్ బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Tags:    

Similar News