బిగ్‌ బ్రేకింగ్‌ : సౌత్‌ హీరోతో అవేంజర్స్‌ డైరెక్టర్‌ మూవీ

Update: 2020-12-18 03:45 GMT
హాలీవుడ్‌ స్టార్స్‌ తో అవేంజర్స్‌ దర్శకద్వయం రుస్సో బ్రదర్స్‌ రూపొందించబోతున్న నెట్‌ ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ మూవీ 'ది గ్రే మ్యాన్‌' లో తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కీలక పాత్రలో నటించబోతున్నాడు. అవేంజర్స్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న రుస్సో బ్రదర్స్‌ దర్శకత్వంలో హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా నటించేందుకు ఆసక్తిగా ఉంటారు. అలాంటి వారితో కలిసి వర్క్ చేసే అవకాశం ధనుష్‌ కు రావడం వండర్‌ అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ది గ్రే మ్యాన్‌ సినిమాను భారీ ఎత్తున నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

హాలీవుడ్‌ స్టార్స్‌ క్రిస్ ఎవాన్స్ మరియు ర్యాన్ గోస్లింగ్ వంటి వారు నటిస్తున్న ది గ్రే మ్యాన్‌ లో ధనుష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెట్‌ ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ మూవీ కోసం ధనుష్‌ 45 రోజుల పాటు షూటింగ్‌ లో పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. తమిళంలో ప్రస్తుతం ఈయన రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినా కూడా హాలీవుడ్‌ ఆఫర్‌ రావడంతో డేట్లు సర్దుబాటు చేసుకుని మరీ ఓకే చెప్పాడు. గతంలో కూడా ధనుష్‌ హాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఈసారి ఓటీటీ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Tags:    

Similar News