టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ‘అర్జున్ రెడ్డి’ని తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్.. టీజర్ నిన్ననే రిలీజయ్యాయి. అవి చూసి సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ గా స్పందిస్తున్నారు జనాలు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులైతే ఓ రేంజిలో ‘వర్మ’ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ని చెడగొట్టేశారని.. ప్రధాన పాత్రకు ధ్రువ్ ఎంతమాత్రం సూట్ కాలేదని.. తెలుగులో ఉన్న ఫీల్.. ఇంటెన్సిటీ ఎంతమాత్రం కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు జనాలు. దాదాపుగా ఈ టీజర్ విషయంలో పాజిటివ్ గా స్పందించిన తెలుగు నెటిజన్లు లేరనే చెప్పాలి. అలాగని తమిళ జనాలు కూడా ఈ టీజర్ విషయంలో అంత పాజిటివ్ గా ఏమీ స్పందించట్లేదు. మామూలుగా విపరీతమైన ప్రాంతీయ భావం చూపించే తమిళ జనాలు సైతం ‘వర్మ’ టీజర్ విషయంలో ప్రతికూల వ్యాఖ్యలే చేస్తున్నారు.
ఈ నెగెటివిటీ చూస్తే.. మలయాళ క్లాసిక్ ‘ప్రేమమ్’ను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయినపుడు కనిపించిన పరిస్థితులే గుర్తుకొస్తున్నాయి. ‘ప్రేమమ్’ రీమేక్ అని ప్రకటించగానే నెగెటివిటీ మొదలైపోయింది సోషల్ మీడియాలో. ముఖ్యంగా సాయిపల్లవి పాత్రకు శ్రుతి హాసన్ ను ఎంచుకోగానే జనాలు మండిపోయారు. గ్లామర్ డాల్ గా పేరున్న శ్రుతి.. సాయిపల్లవి పాత్రకు ఎంత మాత్రం తగదని.. సినిమా చెడిపోతుందని.. ఇది ఆడే అవకాశాలే లేవని తేల్చేశారు. రిలీజయ్యే ముందు వరకు పెద్ద స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. స్వయంగా దర్శకుడు చందూ మొండేటి సైతం ఇంత నెగెటివిటీ ఏంటో అర్థం కాలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఐతే అతను ‘ప్రేమమ్’ రీమేక్ ను చక్కగా డీల్ చేశాడు. డీసెంట్ ఫిలిం తీసి పెట్టాడు. అది జనాలకు నచ్చింది. తెలుగులోనూ ‘ప్రేమమ్’ మంచి విజయం సాధించింది. ఐతే ఏదైనా ఎక్స్ ట్రీమ్ గా చూపిస్తాడని పేరున్న బాల ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ను అంత సెన్సిబుల్ గా తీసి ఉంటాడా అన్న సందేహాలున్నాయి. మరి ‘ప్రేమమ్’ లాగా ‘వర్మ’ సైతం నెగెటివిటీని తట్టుకుని విజయం సాధిస్తుందేమో చూడాలి.