‘డిక్టేటర్’ రివ్యూ
నటీనటులు- బాలకృష్ణ - అంజలి - సోనాల్ చౌహాన్ - రతి అగ్నిహోత్రి - కబీర్ ఖాన్ - విక్రమ్ జీత్ మాలిక్ - నాజర్ - పృథ్వీ - సుమన్ - అక్ష - పోసాని కృష్ణమురళి - వెన్నెల కిషోర్ - షాయాజి షిండే తదితరులు
నేపథ్య సంగీతం- చిన్నా
సంగీతం- తమన్
ఛాయాగ్రహణం- శ్యామ్ కె.నాయుడు
కథ, స్క్రీన్ ప్లే- కోన వెంకట్, గోపీ మోహన్
మాటలు- రత్నం
రచన- శ్రీధర్ సీపాన
నిర్మాణం- ఎరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
దర్శకత్వం- శ్రీవాస్
అబ్బాయి వెంటే బాబాయి కూడా వచ్చేశాడు. ‘డిక్టేటర్’ అవతారంలో బాలయ్య ఈ రోజే థియేటర్లలోకి అడుగుపెట్టాడు. మరి నలుగురు ప్రముఖ రచయితలు కలిసి వండిన స్క్రిప్టును ‘లౌక్యం’ శ్రీవాస్ ఎంత బాగా తెరకెక్కించాడో చూద్దాం పదండి.
కథ:
చందు (బాలకృష్ణ) హైదరాబాద్ లోని తన మామ ఇంట్లో ఉంటూ ఓ సూపర్ మార్కెట్లో సూపర్ వైజర్ గా పని చేస్తుంటాడు. అతడి భార్య ఢిల్లీలో ఉంటుంది. ఐతే సూపర్ మార్కెట్లో తనకు అనుకోకుండా పరిచయమైన ఇందు (సోనాల్ చౌహాన్)ను ఓ ఇబ్బందుల్లోంచి కాపాడబోయి మినిస్టర్ కొడుకుతో పాటు అతడి గ్యాంగ్ మొత్తాన్ని చంపేస్తాడు చందు. దీంతో అతణ్ని ఎన్ కౌంటర్ చేసేయడానికి పోలీసులు రెడీ అవుతుండగా.. చందు అసలు ఐడెంటిటీ ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ చందు ఎవరు? అతడి గతమేంటి? అతడి భార్య ఢిల్లీలో ఏం చేస్తుంటుంది? అన్న ప్రశ్నలకు తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం, విశ్లేషణ:
రొటీన్ కథల్నే మాస్ కు నచ్చేలా తెరకెక్కకిస్తుంటాడు శ్రీవాస్. కోన వెంకట్, గోపీ మోహన్ కూడా అదే టైపు. వీళ్లందరూ కలిసి మనం ఎన్నోసార్లు చూసిన కథతొనే ‘లౌక్యం’ లాంటి సూపర్ హిట్ అందించారు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మళ్లీ ఓ రొటీన్ కథనే పట్టుకొచ్చారు. ‘డిక్టేటర్’ మనకు కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు. ఐతే మాస్ కు నచ్చే హీరోయిజం, పవర్ ఫుల్ పంచ్ డైలాగులు.. అక్కడక్కడా కొంచెం కామెడీ.. హీరోయిన్ల గ్లామర్.. ఇలాంటి మసాలా అంశాలన్నింటినీ కలిపితే.. అదే డిక్టేటర్.
హీరో ఓ సామాన్యుడిలా బతికేస్తుంటాడు. ఓ సమస్యను పరిష్కరించబోయి చిక్కుల్లో పడతాడు. విలన్లు అతణ్ని తక్కువగా అంచనా వేసి.. ఫినిష్ చేయబోతే అతడి గతం తెలుస్తుంది. ఆ గతంలో హీరో పెద్ద పిస్తా. విలన్లకు సింహస్వప్నం. ఫ్లాష్ బ్యాక్ చివర్లో తన ఫ్యామిలీ మెంబర్ కి ఇచ్చిన మాట కోసం ఇక ఈ గొడవలన్నీ మానేసి సామాన్యుడి అవతారం ఎత్తి సింపుల్ గా బతికేస్తుంటాడు. ఇదంతా చెబుతుంటే ‘బాషా’ సినిమా గుర్తురావట్లేదు. ఈ ఫార్ములాతో ఇప్పటికే వందల సినిమాలు వచ్చి ఉంటాయి. ఆ జాబితాలోకి ‘డిక్టేటర్’ను కూడా చేర్చేసుకోవచ్చు. సినిమా అంతా కూడా ఎక్కడా ఒక్క సీన్లోనూ కొత్తదనం లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఐతే ట్రైలర్ దగ్గర్నుంచే ఓ రొటీన్ సినిమాకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశారు కాబట్టి.. ‘రొటీన్’ అనే విషయంలో కంప్లైంట్ చేయడానికేమీ లేదు. ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండొచ్చని అనుకుంటామో అలాగే ఉంటుంది సినిమా. అభిమానుల్ని అలరించే బాలయ్య హీరోయిజం సినిమాకు హైలైట్. ఆరంభంలో బాలయ్యను అలా సింపుల్ గా చూపించడంతోనే ఇక అతడి విశ్వరూపం ఎప్పుడు చూపిస్తాడు, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఐతే ఆ టైం వచ్చే వరకు టైంపాస్ చేయడానికి దర్శకుడు శ్రీవాస్ ఓ కాలనీ, సూపర్ మార్కెట్ సెటప్ లో కొందరు కమెడియన్లను పెట్టి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. సోనాల్ చౌహాన్ ను సీన్లోకి తెచ్చి గ్లామర్ విందు చేయించాడు.
కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోయినా.. సోనాల్ మాత్రం తన అందంతో బాగానే కిక్కిస్తుంది. ఇక బాలయ్య హీరోయిజం చూపించే బార్ ఫైట్, అందులో డైలాగులు అభిమానుల్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పవర్ ఫుల్ అవతారం చూస్తాం. ఐతే ఆ ఎపిసోడ్ పూర్తిగా ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే సాగుతుంది. తర్వాతి సన్నివేశం ఎలా ఉంటుందన్నది ముందే అర్థమైపోతుంటుంది. బాలయ్య, రతి అగ్నిహోత్రి మధ్య వచ్చే సన్నివేశం పండింది. ఇందులో హీరోయిజం బాగా ఎలివేట్ అయింది. ఫ్లాష్ బ్యాక్ ముగిశాక బలవంతంగా ఇరికించిన పాట.. ఆ తర్వాత రొటీన్ క్లైమాక్స్ తో సినిమా ముగుస్తుంది. ఓవరాల్ గా బాలయ్య అభిమానుల వరకు ‘డిక్టేటర్’ బాగానే మెప్పింది. మాస్ ఆడియన్స్ కూడా కనెక్టయ్యే అవకాశముంది. సినిమా అంతా బాలయ్య చుట్టూనే తిప్పడం వల్ల కామెడీకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. పృథ్వీ ఉన్నా సరిగా వాడుకోలేదు. కామెడీ విషయంలో కొంచెం ఫోకస్ పెట్టి ఉంటే సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యేదేమో.
నటీనటులు:
బాలయ్యకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తనదైన శైలిలో పంచ్ డైలాగులు చెబుతూ అభిమానుల్ని అలరించాడు. మాస్ ఆడియన్స్ కు బాలయ్య పాత్ర బాగా కనెక్టవుతుంది. చందుగా కంటే చంద్రశేఖర్ ధర్మగా బాలయ్య గెటప్, నటన బాగున్నాయి. ప్రథమార్ధంలో బాలయ్య మేకప్ మీద సరిగా దృష్టిపెట్టలేదు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వైవిధ్యం చూపించడానికో ఏమో.. ముందు కనిపించే పాత్రలో లావుగా కనిపించాడు. ఈ వయసులోనూ డ్యాన్సులు, ఫైట్ల కోసం బాలయ్య బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్లలో సోనాల్ చౌహాన్ వాట్సాప్ బేబీ పాటలో రెచ్చిపోయి అందాల విందు చేసింది. అంతకుమించి ఆమె చేయడానికేమీ లేదు. అంజలికి తన టాలెంట్ చూపించే ఛాన్స్ లేకపోయింది. ఉన్నంతలో బాగానే చేసింది. విలన్ పాత్రలో రతి అగ్నిహోత్రి పెద్దగా ఇంపాక్ట్ చూపించింది. ఆమె అల్లుడి పాత్రలో చేసిన విలన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. సుమన్, నాజర్, పృథ్వీ, షాయాజి షిండే, పోసాని కృష్ణమురళి.. వీళ్లంతా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. సినిమాలో క్యారెక్టర్లు మరీ ఎక్కువైపోయాయి.
సాంకేతిక వర్గం:
తమన్ పాటలు పర్వాలేదు. వాట్సాప్ బేబీ, చుర చుర.. పాటలు ఆకట్టుకుంటాయి. మిగతావి అంతగా గుర్తుండవు. మాస్ సినిమాకు సూటయ్యే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు చిన్నా. డిక్టేటర్ క్యారెక్టర్ కోసం చేసిన థీమ్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఓకే. కోన వెంకట్, గోపీమోహన్ కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. రచయితలుగా వారి నుంచి ఇక కొత్తదనం ఆశించడం కష్టమేనని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. రత్నం మాస్ ఆడియన్స్.. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు నచ్చే పంచ్ డైలాగులు రాశాడు. కానీ కొన్ని చోట్ల అవసరం లేకున్నా, అవసరానికి మించ డైలాగులు రాసేశాడు. సినిమా వాళ్ల గురించి హీరో చెప్పే డైలాగులు అలాంటివే. ఆ సన్నివేశంలో హీరో అసలు డైలాగులు చెప్పాల్సిన పనే లేదు. ఇలా అనవసరంగా పెట్టిన డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. రొటీన్ కథాకథనాలతోనే ఉన్నంతలో సినిమాను బాగానే డీల్ చేసినందుకు శ్రీవాస్ ను అభినందించొచ్చు కానీ.. ఇలాంటటి కథాకథనాల్నే ఎందుకు ఎంచుకున్నాడన్నది అర్థం కాని ప్రశ్న. ఇలా మసాలా లెక్కలేసుకుని సినిమాను నడిపించడం తప్ప కాస్తయినా కొత్తదనం కోసం ప్రయత్నించకపోవడం నిరాశ కలిగిస్తుంది. నిర్మాత కూడా అయిన శ్రీవాస్ సినిమాను రిచ్ గా తీశాడు.
చివరగా: డిక్టేటర్.. రొటీన్ మాస్ ఎంటర్టైనర్
రేటింగ్- 2.75/5