కొద్దిరోజుల నుండి మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమా హక్కులను తెలుగులో చిరంజీవి కొనుక్కున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి, రాంచరణ్ కలిసి నటిస్తారని, దీనికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగు, తమిళ భాషల అగ్ర హీరోలు చాలామంది ఈ సినిమా హక్కులను దక్కించుకోవాలని ప్రయత్నించారని కానీ 'లూసిఫర్' తీసిన నిర్మాతలే వేరే భాషల్లోనూ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నామని చెప్పి ఈ హక్కులను వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. తమిళం నుండి రజనీకాంత్, అజిత్ లాంటి వాళ్ళు అడిగినా ఈ సినిమా హక్కులను ఇవ్వలేదు.
అలాంటిది ఈ సినిమా తెలుగు రైట్స్ చిరంజీవి ఎలా దక్కించుకున్నారు అని చర్చించుకుంటున్నారు. మలయాళంలో 'లూసిఫర్' సినిమాలో హీరోగా నటించిన మోహన్ లాల్ కి మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటినుండో మంచి స్నేహం ఉంది. దాంతో ఈ సినిమా హక్కుల కోసం చిరంజీవి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న మోహన్ లాల్ ఆ సినిమా నిర్మాతలను ఒప్పించి చిరంజీవికి ఆ సినిమా రైట్స్ ఇప్పించాడని తెలుస్తుంది. ఈ సినిమాను చిరంజీవి తన 153వ సినిమాగా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి సుకుమార్ ని డైరెక్టర్ గా అనుకుంటున్నారు. ఎప్పుడూ తాను రాసుకున్న కథలతోనే సినిమాలు తీసే సుకుమార్ ఈ రీమేక్ సినిమాని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడో... లేదో... చూడాలి. ఇవన్నీ కన్ఫర్మ్ అవ్వాలంటే మరికొద్ది నెలలు ఆగక తప్పదు.